Friday Box office : ఈ ఫ్రైడే థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే 

ఫిబ్రవరి డిజాస్టర్ మంత్ గా ముగిసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ చూపంతా రానున్న మార్చి నెల పైనే ఉంది. మార్చిలో పలు కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ వారం అంటే మార్చ్ 1న కొన్ని కొత్త సినిమాలతో పాటు, రీ రిలీజ్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఈ ఫ్రైడే థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఆపరేషన్ వాలెంటైన్
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఆపరేషన్ వాలెంటైన్”. ఈ సినిమాతో మానుషి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండగా, మరోవైపు వరుణ్ తేజ్ కు హిందీలో ఇదే మొదటి చిత్రం కానుంది. రుద్ర అనే పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత్ జవాన్ల పై జరిగిన దాడి, ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ తో పాటు అక్కడ ఉన్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకున్న స్టోరీ నేపథ్యంలోనే ఈ మూవీ రూపొందింది. మూవీపై మంచి బజ్ ఉంది. పలు వాయిదాల అనంతరం ఈ మూవీ ఎట్టకేలకు మార్చ్ 1న రిలీజ్ కానుంది. వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న వరుణ్ ఈ సినిమా పైన తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. పైగా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను తప్పకుండా ఆదరించాలని ఆడియన్స్ ను రిక్వెస్ట్ చేశారు. మరి “ఆపరేషన్ వాలెంటైన్”కు ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.
  2. “చారి 111”
    టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ “చారి 111”. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కు జోడిగా తమిళ హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి కీలక పాత్రలో నటించగా, ఈ మూవీని బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చ్ 1న థియేటర్ల రాబోతోంది. ఈ మూవీతో కమెడియన్ గా ఉన్న వెన్నెల కిషోర్ ను హీరోగా అదృష్టం వరిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.
  3. సింహాద్రి వర్సెస్ సమరసింహా రెడ్డి
    మార్చ్ 1న ఒకవైపు కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే మరోవైపు పాత సినిమాలు రీ రిలీజ్ తో వాటికి గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి అబ్బాయ్, బాబాయ్ మధ్య జరగనున్న బాక్స్ ఆఫీస్ వార్ పై అందరి దృష్టి ఉంది. మార్చ్ 1 యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ “సింహాద్రి”, మార్చి 2న నందమూరి బాలయ్య ఫ్యాక్షన్ మూవీ “సమరసింహా రెడ్డి” రీ రిలీజ్ కానున్నాయి.

ఈ సినిమాలతో పాటు భూతద్దం భాస్కర్ నారాయణ, మా ఊరి రాజారెడ్డి, రాధా మాధవం, ఇంటి నెంబర్ 13 వంటి చిన్న సినిమాలు సైతం మార్చ్ 1నే టార్గెట్ చేస్తున్నాయి. అలాగే హాలీవుడ్ మూవీ “డ్యున్ 2”, బాలీవుడ్ మూవీ “లాప్తా లేడీస్” కూడా మార్చ్ 1నే విడుదల కానున్నాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు