Venkatesh: పర్ఫెక్ట్ కాంబినేషన్

పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అనిల్. మొదటి సినిమాతోనే దర్శకుడుగా తనకంటూ ఒక మంచి పేరును క్రియేట్ చేసుకున్నా డు. ఆ సినిమా తర్వాత చేసిన సుప్రీమ్ సినిమా కూడా మంచి హిట్ అయింది. అనిల్ రావిపూడి కెరియర్ లో ఇప్పటివరకు ప్లాప్ అయిన సినిమా అంటూ ఏమీ లేదు. దిల్ రాజు ప్రొడక్షన్లో ఎక్కువ సినిమాలు చేశాడు అనిల్.

తక్కువ టైంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కింది అనిల్ కి. అనిల్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అంటే సరిలేరు నీకెవ్వరు అని చెప్పొచ్చు. అనిల్ చేసిన ఎఫ్2 సినిమా కూడా దాదాపు 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అనిల్ రీసెంట్గా చేసిన సినిమా “భగవంత్ కేసరి” ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరియర్ లో మంచి హిట్ అనిపించింది.

ప్రస్తుతం అనిల్ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన త్రిషా నటిస్తోంది. ఇదివరకే వెంకటేష్ తో రెండుసార్లు వర్క్ చేశాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ తో చేసిన రెండు సినిమాలు కూడా మంచి హిట్స్ అనిపించుకున్నాయి. పర్ఫెక్ట్ కామెడీ రాయడంలో అనిల్ ఇప్పుడున్న దర్శకులలో ముందు వరుసలో ఉంటాడని చెప్పొచ్చు. ఎఫ్2 సినిమా కూడా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కామెడీ.

- Advertisement -

అనిల్ రావిపూడి చేసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసేలా ఉంటాయి. మరోసారి వెంకటేష్ తో అనిల్ సినిమా చేస్తున్నాడు అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే వెంకటేష్ కామెడీ టైమింగ్ కి సరిపోయేలా అనిల్ పర్ఫెక్ట్ గా రాస్తాడు అని ఇదివరకే ఆల్రెడీ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఈసారి వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అంటే అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు