Chandoo Sai : తప్పు ఇద్దరూ చేసినా శిక్ష అబ్బాయిలకే పడుతుంది..

తెలుగులో కొన్నాళ్ల కింద ఫేమస్ అయిన యూట్యూబర్ చందు సాయి గురించి తెలిసిందే. పక్కింటి కుర్రాడిలా వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చేసే ఇతను గత కొన్ని నెలల కింద అరెస్ట్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎప్పుడూ వివాదాల్లో కూడా లేని ఇతనిపై ఒక అమ్మాయి సడన్ గా రేప్, 420 కేసులు పెట్టింది. కొన్ని రోజుల పాటు ఈయన జైల్లో ఉన్న చందూ తాజాగా బయటకు వచ్చాడు. ఇక తాను అరెస్ట్ అయిన దాని విషయంపై తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన కేసుకు సంబంధించిన అనేక విషయాలు చెప్పుకొచ్చాడు.

ఆ ఇంటర్వ్యూ లో చందూ సాయి తనని కావాలనే బ్లేమ్ చేసారని, తనపై అలాంటి తప్పుడు కేసులు పెట్టి తన కడుపు మీద కొట్టారని చెప్పుకొచ్చాడు. దాదాపు 27 రోజుల పాటు జైలు జీవితం గడిపానని తనలా అన్యాయంగా శిక్ష అనుభవించిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారని అన్నాడు. ఇక తాను ప్రేమలో ఉన్న విషయం వాస్తవమని, అలాగే తామిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ వాళ్లే తన మీద కోపం పెట్టుకుని, విపరీతమైన పగ పెంచుకుని తనపై కావాలని కేసులు పెట్టినట్లు తెలిపాడు. ఏమైనా తప్పు చేస్తే కేసు పెడితే ఓకే కానీ రేప్, 420 కేసులు మాత్రం బలంగా ఉండాలని, కావాలని పెట్టినట్లు తెలిపాడు.

ఈ విషయమై యూత్ అబ్బాయిలకు మెసేజ్ ఇస్తూ, అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లాంటివి పెట్టుకోకండి, తప్పు జరిగిందంటే అది ఇద్దరు చేసినట్టే కానీ దెబ్బ అబ్బాయిలకే పడుతుంది. ఇప్పుడు సోసిటీ లాగే ఉంది అని అన్నాడు. ఒకవేళ ప్రేమించకపోయినా, 420 పనులు, రేప్ లు లాంటివి మనమెందుకు చేస్తాము, లివింగ్ లో ఇద్దరూ ఉన్నాము, కాపాడుకోవాలని చూసాను. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, అయితే వాళ్ళు తప్పుగా అనుకోని నా పైన కేసు నా మీద వేసారు అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కూడా డ్రగ్, ఇంకా అమ్మాయి కేసులో అరెస్ట్ అయ్యాడు. తన సోదరుడు చేసిన పనికి తనని కూడా కలిపి అరెస్ట్ చేయగా, గతంలో కూడా రాష్ డ్రైవింగ్ కేసులో ఓసారి అరెస్ట్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. ఇక జనాలు మాత్రం ఈ మధ్య ఇవి కామన్ అయిపోయాయి అంటూ, లైట్ తీసుకుంటున్నారు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు