Youtuber Shanmukh: షణ్ముక్ గంజాయి కేసు… లైంగిక దాడి అంటూ ట్విస్ట్

ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు షణ్ముఖ్ అన్న కోసం ఒక కేసు విషయంలో వారి ఇంటికి వెళ్ళగా.. అక్కడ షణ్ముఖ్ తో పాటు అతని అన్న సంపత్ వినయ్ గంజాయితో అడ్డంగా దొరికిపోయారు.. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కి కొన్ని రోజుల్లో మౌనిక అనే అమ్మాయితో వివాహం కానుంది.. అయితే మౌనిక అనే అమ్మాయి.. తనని పదేళ్లుగా ప్రేమించి.. ఇప్పుడు తనను మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సంపత్ పై కేసు పెట్టింది.. అయితే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సంపత్ వినయ్ ఇంటికి వెళ్తే అక్కడ ఊహించని విధంగా అన్నదమ్ములు ఇద్దరు గంజాయితో పట్టుపడ్డారు.

వీరి వద్ద నుంచి దాదాపు 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇకపోతే పోలీసులు సంపత్ ను అలాగే షణ్ముఖ్ ను గంజాయి విషయంలో అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో షణ్ముఖ్ హిట్ అండ్ కేసులో వైరల్ అవ్వగా.. ఇప్పుడు ఇలా గంజాయితో పోలీసులకు పట్టుబడి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక దీనిపై అటు షణ్ముఖ్ అలాగే అతని అన్న సంపత్ వినయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

లైంగిక దాడి అంటూ ట్విస్ట్…

- Advertisement -

మౌనిక ఫిర్యాదుతో షణ్ముక్ ఇంటికి వెళ్లిన పోలీసులకు గంజాయి కనిపించడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. షణ్ముక్, అతని సోదరుడు సంపత్ వినయ్ ని పోలీసులు విచారించగా పలు సంచలన విషయాలు బయటికి వచ్చాయని తెలుస్తుంది. యూట్యూబ్ లో ఛాన్స్ ఇస్తా అని మౌనికను షణ్ముక్ మోసం చేశాడట. అలాగే షణ్ముక్ సోదరుడు సంపత్… మౌనికను లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసిందని సమాచారం. తనను హోటల్స్, విల్లాలకు తీసుకు వెళ్లి బెదిరించి, పలు మార్లు లైంగిక దాడి చేశారని పోలీసులకు మౌనిక చెప్పినట్టు సమాచారం.

సంపత్ వల్ల మౌనిక ఒక సారి గర్భం కూడా దాల్చిందట. దీంతో మౌనికకు సంపత్ అబార్షన్ కూడా చేయించాడు. అయితే సంపత్ కు ఇప్పటికే పెళ్లి అయిందని మౌనికకు తెలియడంతో సంపత్ తనను మోసం చేశాడని కేసు పెట్టినట్టు సమాచారం. దీంతో ఈ గంజాయి కేసు కాస్త.. లైంగిక దాడి కేసు వరకు వెళ్లినట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసులు త్వరలోనే పూర్తి సమాచారం ఇవ్వనున్నారు.

యూట్యూబ్‌తో ఫేమస్ అయి…

ఇక షణ్ముఖ్ జస్వంత్ విషయానికి వస్తే.. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ , సిరీస్ లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈయన బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు .. ముఖ్యంగా తెలుగులో అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న సింగిల్ యూట్యూబర్ గా రికార్డు కూడా సాధించారు.. ఇక డిజిటల్ మీడియాలో ఇంత భారీ పాపులారిటీ ఉంది కాబట్టి క్షణాల్లో ఈ వార్త కాస్త వైరల్ అయిపోయింది.షణ్ముఖ జస్వంత్ వ్యక్తిగత విషయానికి వస్తే ..తోటి యూట్యూబర్ దీప్తి సునయనతో ప్రేమాయణం నడిపి.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సీరియల్ నటి, ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ సిరి హనుమంతుతో ప్రేమాయణం కొనసాగించారు ..అయితే తమ ఇద్దరు మధ్య ఏమీ లేదని స్నేహం మాత్రమే ఉందని చెప్పినా దీనికి దీప్తి అటు ప్రేక్షకులు కూడా అంగీకరించలేకపోయారు. దీంతో చివరికి ఇద్దరూ విడిపోయి ఎవరికి వారు ఒంటరిగా జీవిస్తున్నారు. ఇక ఇప్పుడు షణ్ముఖ్ ఇలా గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడి వార్తల్లో నిలిచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు