Kodi Ramakrishna Death Anniversary : చిరంజీవిని అవమానిస్తేనే హిట్… ఎన్ని సినిమాల్లో అవమానించారంటే?

లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ తన అభిమానులందరికీ శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన రోజు ఈ రోజు. 2019 ఫిబ్రవరి 22న ఈ డైరెక్టర్ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఆయన డెత్ యానివర్సరీ సందర్భంగా కోడి రామకృష్ణ సినిమాలను, ఆయనకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఇక ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరితో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధమే ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కోడి రామకృష్ణకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ డైరెక్టర్ కు అప్పట్లో ఒక సెంటిమెంట్ ఉండేదట. చిరంజీవిని అవమానిస్తేనే ఆ సినిమా హిట్ అని బలంగా నమ్మేవారట కోడి రామకృష్ణ. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా విషయంలో కూడా అదే నిజమైంది.

ఈ మూవీ తోనే దర్శకుడిగా తొలి అడుగు వేసిన కోడి రామకృష్ణ ముందుగా కథను సిద్ధం చేసుకుని నిర్మాత రాఘవను కలిశారట. ఆయన హీరోగా ఎవరిని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా, మరో ఆలోచన లేకుండా చిరంజీవి అని చెప్పేశారట. కానీ నిర్మాత రాఘవ మాత్రం అలా ఎలా ఫిక్స్ అవుతావు? మా నిర్మాణ సంస్థలో కొందరు హీరోలు ఉన్నారు. వాళ్లతోనే ఈ మూవీ చేద్దామని చెప్పారట. కానీ కోడి రామకృష్ణ మాత్రం పట్టు వదలకుండా తన కథకు చిరంజీవి అయితేనే సరిపోతాడని ఆయనను కన్విన్స్ చేసి ఒప్పించుకున్నట్టు అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ స్వయంగా వెల్లడించారు. భార్య అనుక్షణం భర్తను అనుమానించడం, అవమానించడం అనేది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ స్టోరీ లైన్. ఈ విషయం తెలిసిన చాలామంది ఇలాంటి స్టోరీకి చిరంజీవిని ఎలా అనుకుంటారు అంటూ కోడి రామకృష్ణ పై పలు రకాలుగా కామెంట్స్ కూడా చేశారట. అయితే అప్పటికి మెగాస్టార్ ఇమేజ్ లేని చిరంజీవి అయితేనే ఈ మూవీకి పర్ఫెక్ట్ గా సరిపోతాడని భావించిన కోడి రామకృష్ణ చివరకు తన పంతాన్ని నెగ్గించుకుని ఆయనతోనే సినిమాను తీశారు.

అప్పట్లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ఏకంగా 525 రోజులు ఆడి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ చిరంజీవి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇంక ఆ తర్వాత చిరంజీవి, కోడి రామకృష్ణ దర్శకత్వంలో గూడచారి నెంబర్ వన్, ఆలయ శిఖరం, రిక్షావోడు, సింహపురి సింహం, అంజి లాంటి సినిమాలు వచ్చాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు