Kodi Ramakrishna Death Anniversary : అనుష్కకు కోడి రామకృష్ణ అంటే అంత అభిమానం ఎందుకో తెలుసా?

లెజెండరీ దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తూ ఈ డైరెక్టర్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే కోడి రామకృష్ణ, స్టార్ హీరోయిన్ అనుష్క మధ్య ఉన్న అనుబంధం, అసలు ఆయన అంటే అనుష్కకు ఎందుకంత అభిమానం? అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.

అప్పట్లో దైవ భక్తి సినిమాలు అంటే టక్కున గుర్తుచ్చే పేరు డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన రూపొందించిన అమ్మోరు, అరుంధతి వంటి సినిమాలు థియేటర్లను దద్దరిల్లేలా చేశాయి. దైవభక్తి, మానవ సంబంధాలు, ఆధునిక గ్రాఫిక్స్ అంశాలను కలగలిపి తనదైన శైలిలో సినిమాలు తీస్తూ సినీ ప్రియులను అలరించేవారు కోడి రామకృష్ణ. ఆధ్యాత్మిక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ దర్శకుడు ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. అందుకే ఆయనంటే చాలామంది స్టార్స్ కు ఇప్పటికీ అభిమానం, గౌరవమే. ఇక అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనుష్క గురించి. అలాగే ఆయన తీసిన అన్ని సినిమాల్లో ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా అరుంధతి గురించే మాట్లాడుకోవాలి.

ఈ సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేశారు కోడి రామకృష్ణ. అరుంధతి సినిమాతో అనుష్కలోని మరో కోణాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు ఆయన. అప్పటిదాకా కేవలం ఎలాంటి ప్రాధాన్యత లేని గ్లామర్ డాల్ పాత్రలకు మాత్రమే పరిమితమైన అనుష్క కెరీర్ అరుంధతి తర్వాత కొత్త మలుపు తిరిగింది. ఆమెలోని యాక్టింగ్ టాలెంట్ ను బయట పెట్టిన ఈ మూవీ తరువాత ప్రేక్షకులతో పాటు డైరెక్టర్స్ కూడా ఆమెను చూసే విధానం మారిపోయింది. అనుష్క అంటే కేవలం అందాలు ఆరబోసే బ్యూటీ మాత్రమే కాదు అని ఈ మూవీ నిరూపించింది. అంతేకాదు ఆమెకు స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టింది.

- Advertisement -

అరుంధతి సినిమా తర్వాత అనుష్క పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకొని నిన్నటి దేవసేన దాకా ఎదిగింది అంటే అది అరుంధతి వల్లనే సాధ్యమైంది. అందుకే కోడి రామకృష్ణ అంటే అనుష్కకు చెప్పలేనంత అభిమానం. ఇక ఈ సినిమా వల్ల కేవలం అనుష్క కెరీర్ మాత్రమే కాదు సోనూసూద్ లైఫ్ కూడా మారిపోయింది. అప్పటిదాకా విలన్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న సోను సూద్ కు అరుంధతి మూవీ స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. ఈ రోజు కోడి రామకృష్ణ డెత్ యానివర్సరీ సందర్భంగా తమకు లైఫ్ ఇచ్చిన ఈ లెజెండరీ డైరెక్టర్ ను అనుష్క, సోను సూద్ తలచుకొనే ఉంటారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు