Anushka Shetty: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫస్ట్ వీక్ లెక్క.. బ్లాక్ బస్టర్ దిశగా?

Anushka Shetty:

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో, సెలబ్రిటీ విషెస్ ప్రమోషన్స్ తో హైప్ తెచ్చుకుంది. నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో తప్ప తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు. కానీ మౌత్ టాక్ ప్లస్ అవడంతో ఈ క్లాస్ సినిమా మంచి వసూళ్ళని అందుకుంది.

నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ఇంకా ఎమోషన్స్ తో పాటు, అనుష్క స్క్రీన్ టైమింగ్ ఈ సినిమాకి కలిసొచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వివరాలు బయటికి వచ్చాయి. ఫస్ట్ డే కేవలం 3కోట్ల వరకు ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా, వీకెండ్ ముగిసేసరికి 13కోట్ల కి పైగా షేర్ సాధించి బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఇప్పుడు మొదటి వారం ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 16. 75కోట్ల షేర్, 32 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి పోటీగా బాలీవుడ్ మూవీ జవాన్ కూడా రిలీజ్ అవడంతో ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది. లేదంటే మరో 10 కోట్లయినా అదనంగా వచ్చేది. ఇక రెండో వారంలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావడం లేదు గనుక మరో వారం రోజులు శెట్టి సినిమా కలెక్షన్లు పిండుకునే అవకాశం ఉంది. 3కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా ప్రయాణిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు