Jawan: కమ్ బ్యాక్ అనే ఇలా ఉండాలి.. వారంలో గదర్ ని లేపేసాడు?

Jawan:

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ళ తరువాత బాక్స్ ఆఫీస్ పై దండెత్తాడు. ఒకసారి పఠాన్ గా వచ్చి గెలిచే సరికి బాలీవుడ్ జనాలు కొసమెరుపు, అప్పుడప్పుడు ఇలాంటి విధాలు జరుగుతూ ఉంటాయని వేరే హీరోల ఫ్యాన్స్, లేదంటే షారుఖ్ వ్యతిరేక వర్గం అన్నారు. కానీ ఆరు నెలల గ్యాప్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ పై అంతకు మించిన విధ్వంసం ఓపెనింగ్స్ తో సృష్టిస్తాడని ఎవరు గెస్ కూడా చేయలేదు.

షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే భారీ కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు తిరగరాసింది. తాజాగా ఫస్ట్ వీక్ రికార్డుల లెక్కలు వచ్చేసాయి. రిలీజ్ అయిన జవాన్ ఇప్పటివరకు అంటే ఏడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 650కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం విశేషం. ఇక గత నెలలో వచ్చిన గదర్ 2 రికార్డుని కేవలం వారం రోజుల్లో లేపేసింది జవాన్.

అయితే ఈ రికార్డు తెలుగు, తమిళ భాషల్ని కలుపుకోవడం వల్లే సాధ్యపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు, అటు తమిళ్ లో కలిపి జవాన్ 60 కోట్లకి పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు కనుక జవాన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన బాక్స్ ఆఫీస్ పరుగును కొనసాగించడం ఖాయం. ఇక జవాన్ కూడా 1000కోట్ల వరకు వసూలు చేయొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు