Rashmi: అనసూయ ఆపేసింది – రష్మీ స్టార్ట్ చేసింది – కామసూత్రపై షాకింగ్ కామెంట్స్..!

Rashmi

జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రష్మీ కూడా అనసూయను ఫాలో అవుతున్నట్లుంది. సనాతన ధర్మంపై కంటిన్యూగా ట్వీట్స్ చేస్తూ నెటిజన్ల కామెంట్స్ ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తోంది రష్మీ. సనాతన ధర్మం గురించి రష్మీ పెట్టిన పోస్ట్స్ కి నెటిజన్స్ తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి, చేసే షోస్, సినిమాల గురించి పాయింట్ ఔట్ చేస్తూ కౌంటర్స్ ఇస్తున్నారు.
నెటిజన్ల కామెంట్స్ కి రెస్పాండ్ అయిన రష్మీ, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ వంటివి పూర్తిగా డైరెక్టర్ల మీద డిపెండ్ అయ్యుంటుందని రిప్లై ఇచ్చింది. సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ కామసూత్ర పై రష్మీ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కామసూత్ర కూడా సంతానంలో ఒక పార్ట్ అని, అప్పట్లో మహిళల డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే అర్థమవుతుందని కామెంట్ చేసింది.
ప్రస్తుతం మహిళల పట్ల ఉన్న వివక్షకు, హిందూ మతానికి, సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది రష్మీ. ఇంతే కాకుండా నిన్నటి నుండి కంటిన్యూగా ట్విట్టర్లో సనాతనంపై ఈ హాట్ యాంకర్ చేస్తున్న ట్వీట్స్ చూసి అనసూయ లేని లోటును రష్మీ తీర్చేస్తోందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు