Rashmi: నేను అనసూయ లాంటిదాన్ని కాదు.. రష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బుల్లితెర సామ్రాజ్యంలో జబర్దస్త్ అనే కార్యక్రమంతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్. జబర్దస్త్ కామెడీ షో తో అనసూయ పాపులర్ అయితే.. ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో తో రష్మీ గౌతమ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు టీవీ ప్రేక్షకులకు వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అంతలా తెలుగు టీవీ తెరపై సంచలనాలు సృష్టించారు వీరిద్దరు. ఇక ఇదే క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా పనికొస్తుంది. జబర్దస్త్ పేరు చెప్పుకొని వరుసగా సినిమాలు చేస్తున్నారు ఈ యాంకర్స్.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీ గౌతమ్ అనసూయ భరద్వాజ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.అనసూయ చేసిన తప్పును తాను ఎన్నటికీ చేయనని చెప్పింది. తనకి సినిమాలలో నటించడం ఇష్టమే కానీ.. దానికోసం తన యాంకర్ కెరియర్ ని మానుకోనంటూ చెప్పుకొచ్చింది. అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి.. సినిమాలకే పూర్తిగా సమయం కేటాయిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆమెకి సినిమాలలో ఆశించినంత స్థాయిలో వరుసగా ఆఫర్స్ రావడం లేదు.

ఇప్పటికే జబర్దస్త్ నుండి వేరే షోలకి గాని, బయటకు వెళ్లిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. అందుకే తాను అలాంటి తప్పు అస్సలు చేయనని చెప్పుకొచ్చింది రష్మి. తాను టీవీ రంగాన్ని వదిలి వెళ్ళిపోను అంటూ స్పష్టం చేసింది. ఇక ఈ వీడియో చూసిన చాలామంది అనసూయని దృష్టిలో పెట్టుకుని రష్మి ఇలా మాట్లాడిందని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు