Devara: ఎన్టీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు ఆగ్ర హీరోగా కొనసాగుతున్నారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ డమ్ ను రుచి చూసాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు.సినీ కెరీర్ లోను, వ్యక్తిగత జీవితంలోను ఉన్నత పతనాలను చవి చూశాడు. ఆది బ్లాక్ బస్టర్ తో మొదలైన ఎన్టీఆర్ స్టార్ డమ్ ఆర్ఆర్ఆర్ తో మరింత పీక్స్ కి చేరింది. ఇక ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ ఆస్తులపై ఓ వార్త వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు.
అంటే భారతీయ కరెన్సీలో చూసుకుంటే సుమారు 571 కోట్లు అని తెలుస్తోంది. ఇక నెలకి ఎన్టీఆర్ మూడు కోట్లకు పైగా సంపాదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఒక్కో సినిమాకి ఎన్టీఆర్ 15 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకి ఏకంగా ఎన్టీఆర్ 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక ఈ సినిమా ఇప్పుడు భారీగా బ్లాక్ బస్టర్ అయ్యి ఆస్కార్ కూడా అందుకోవడంతో ఎన్టీఆర్ మార్కెట్ బీభత్సంగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ ని కూడా భారీగానే పెంచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి తారక్ 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో 25 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తున్నారు. హైదరాబాదులో మాత్రమే కాక బెంగళూరులో కూడా ఎన్టీఆర్ కి ఆస్తులు బాగానే ఉన్నాయట. కార్లు, రిసార్టులు కూడా ఉన్నాయట.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు