Varshini: SRH ప్లేయర్ తో యాంకర్ రొమాన్స్ ?

తెలుగు టాప్ యాంకర్లలో యాంకర్ వర్షిని ఒకరు. ఈ స్టార్ యాంకర్ వర్షిని గురించి తెలియని వారు ఉండరు. పటాస్ 2 షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన వర్షిని తెరపై కనిపించిందంటే అభిమానులకు పండగే. ముద్దు ముద్దు… అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్ర లేకుండా ఈ భామ… అటు టీవీ రియాలిటీ షోలతోనూ అలాగే వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన వర్షినికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఈ మధ్యకాలంలో తన అందాలతో బాగా రచ్చచేసింది. అటు ఐపీఎల్ మ్యాచ్ కు హాజరవుతోంది. ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం మన హైదరాబాద్ జట్టులో ఉన్న క్రేజీ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు బాగానే పరిచయమయ్యారు. అప్పట్లో బెంగళూరుకి ఆడిన ఈయన ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ లోనే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ వర్షిని వాషింగ్టన్ సుందర్ తో ప్రేమలో పడిందనే వార్తలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వర్షినితో రిలేషన్ కారణంగానే వాషింగ్టన్ సుందర్ ను జట్టు నుంచి బయటకు పంపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్ ను జట్టు నుంచి పంపించినట్లు సమాచారం అందుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు