Bichagadu2: తమిళ్ ఫిలిమ్ మేకర్స్ కి బిచ్చగాడు నేర్పిన పాఠం ఏంటి..?

హీరోగా మారిన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన బిచ్చగాడు సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు కి సీక్వెల్ గా బిచ్చగాడు2 సినిమా ఇటీవల విడుదలైంది. తొలిరోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ మంచి ఓపెనింగ్స్ రాబట్టగలిగింది. ఈ సినిమా తమిళ్ లో 3కోట్ల గ్రాస్ వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 4కోట్ల గ్రాస్ తో తమిళ్ కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టి  అందరిని ఆశ్చర్య పరిచింది. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన మణిరత్నం సినిమా పీఎస్2 తెలుగులో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

పీఎస్2 కి తెలుగులో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కని సమయంలో టాలీవుడ్ ఆడియెన్స్ కి టేస్ట్ లేదంటూ ప్రచారం చేశాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పుడు బిచ్చగాడు2 సినిమాని విజయ్ ఆంటోని పెద్దగా ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా రిలీజ్ చేసినప్పటికీ మంచి ఓపెనింగ్స్ రావటంతో టాలీవుడ్ ఆడియెన్స్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. బిచ్చగాడు ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ బి, సి సెంటర్ ఆడియెన్స్ ఇంకా మరిచిపోలేదని పార్ట్ 2 ఓపెనింగ్స్ ద్వారా తెలుస్తోంది.

తొలి ఆట నుండి మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ సినిమాకి మల్టీప్లక్స్ లో మినహాయిస్తే చాలా సింగిల్ స్క్రీన్స్ లో హౌస్ ఫుల్ పడటం విశేషం. బిచ్చగాడు ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉండటంతో సినిమాకి మిశ్రమ స్పందన వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పీఎస్ 2 సమయంలో టాలీవుడ్ ఆడియెన్స్ ని ఆడిపోసుకున్న కోలీవుడ్ వర్గాలు ఇప్పడు బిచ్చగాడు 2కి తెలుగులో వస్తున్న రెస్పాన్స్ చూసి గుణపాఠం నేర్చుకుంటాయో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు