Allu Arjun: పుష్ప 2 కోసం అప్పటిదాకా ఆగక తప్పదా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత నార్త్ లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యి పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి గత నెలలో విడుదలైన గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. రిలీజ్ ఇంకా చాలా సమయం ఉన్నా కూడా ఈ సినిమాకు సంబంధించి తరచూ ఎదో ఒక అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తూ హీట్ పెంచుతోంది.

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల గురించి వరుసగా ఏదో ఒక అప్డేట్ రిలీజ్ అవుతూ అభిమానులు సందడి చేస్తున్న తరుణంలో పుష్ప2 కి సంబంధించి గత నెలలో వచ్చిన ‘వేర్ ఈజ్ పుష్ప’ గ్లిమ్ప్స్ మినహా ఏ అప్డేట్ రాకపోవటంతో అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 2024 మార్చ్, లేదా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. ఈ క్రమంలో ఇప్పుడప్పుడే టీజర్ లాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి  అల్లు అర్జున్ అభిమానులకు ఎదురు చూపులు తప్పవన్నమాట.

పుష్ప పార్ట్ 1 అనూహ్య రీతిలో పాన్ ఇండియా హిట్ అందుకోవటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ సాధించింది. పుష్ప 2 లో ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ కూడా నటించనున్నారన్న వార్తలొచ్చిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి, పుష్ప ది రూల్ తో తొలి పాన్ ఇండియా హిట్ అందుకున్న సుకుమార్ ల కాంబినేషన్ పుష్ప 2తో పాన్ ఇండియా హిట్ స్ట్రీక్ ని కొనసాగిస్తారా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు