Dhanush : ‘రాయన్’ లో ఎంట్రీ ఇస్తున్న విలక్షణ దర్శక నటులు..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఈ పొంగల్ కి కెప్టెన్ మిల్లర్ తో యావరేజ్ హిట్ కొట్టిన ధనుష్ పెద్దగా గ్యాప్ కూడా తీసుకోకుండా తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే వారం రోజుల షెడ్యూల్ ని కూడా పూర్తి చేసిన ధనుష్, ఆ సినిమా గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ లో కూడా బిజీ అవుతున్నాడు. అయితే రీసెంట్ గా తన కొత్త సినిమా అనౌన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. “రాయన్” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధనుష్ నటించడమే గాకుండా దర్శకత్వం కూడా తానే వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.

ధనుష్ ఒక మెకానిక్ గా నటిస్తున్న ఈ సినిమాలో పోస్టర్ లోనే సందీప్ కిషన్, తమిళ్ నటుడు కాళిదాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారని రివీల్ చేసారు. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు విలక్షణ నటులు కూడా నటిస్తున్నారని తాజాగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఆ ఇద్దరు కూడా విలక్షణ దర్శకులు కూడా. ఒకప్పుడు వాళ్ళ సినిమాలతో ఇండస్ట్రీని ఊపేసిన ఆ దర్శకులు ఇప్పుడు నటులుగానూ మంచి పాత్రలు చేస్తూ రానిస్తున్నారు. వాళ్లలో ఒకరు ఎస్.జె. సూర్య కాగా, మరొకరు సెల్వ రాఘవన్. తాజాగా ధనుష్ తన ట్విట్టర్ పేజ్ ద్వారా ఈ ఇద్దరూ తన రాయన్ సినిమాలో నటిస్తున్నారంటూ అనౌన్స్ చేసాడు.

ఇక సెల్వ రాఘవన్ స్వయానా ధనుష్ అన్న కూడా కావడం వీశేషం. వీళ్లిద్దరి కాంబోలో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఇప్పుడు మొదలైనా కూడా శేఖర్ కమ్ముల తో ధనుష్ సినిమా పూర్తి అయిన తర్వాతే ఈ సినిమాపై పూర్తిగా ఫోకస్ పెడతాడట ధనుష్. మరి రాబోయే రోజుల్లో ఇంకెంత మంది స్టార్ క్యాస్టింగ్ ని రాయన్ లో దించుతాడో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు