Siddharth Roy Frist Review : సిద్ధార్థ్ రాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలు ఎదుర్కొన్న చిత్రంగా పేరు తెచ్చుకుని అదే హైప్ తో ఫిబ్రవరి23న రిలీజ్ అవుతుంది. ముందునుండి అర్జున్ రెడ్డి కాపీ లా ఉందని ట్రైలర్ చూసిన ఆడియన్స్ అంటున్నా మేకర్స్ కాదని అంటూ మ్యానేజ్ చేస్తూ వచ్చారు. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో తన్వి నేగి హీరోయిన్ గా నటించింది. యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ రెడ్డికి మ్యూజిక్ ఇచ్చిన రాధనే సంగీతం అందించాడు. ఇచ్చాడు. అయితే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ కొన్ని చోట్ల ముందే పడిపోయాయి. దాంతో మూవీ ఫస్ట్ రివ్యూ ఆల్రెడీ వచ్చేసింది.

ఇక లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం సినిమా ఎలా ఉందంటే.. అర్జున్ రెడ్డి 2.0 లా ఉందని, సినిమా చూసిన వాళ్ళందరి మాట. వినడానికి సింపుల్ గా చెప్పేసేలా స్టోరీ ఉంటుంది. సినిమాలో హీరో పాత్రని ఆడియన్స్ పై రుద్దేలా ప్రతీ సీన్ లో హీరోని లేపే ప్రయత్నమే చేసారు గాని, కంటెంట్ లో ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ మాత్రం ఇవ్వలేదట. సినిమాలో హీరో అర్జున్ రెడ్డి లానే తెలివైన వాడుగా ఉండి, అతి తెలివైన వాడిలా బిహేవ్ చేస్తూ, వ్యసనాలకు బానిసై, తానే కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు. దీనికి హీరోని సపోర్ట్ చేసేవారు, వాడే కరెక్ట్ అంటూ వంత పడడం మాత్రం, ఆడియన్స్ కి ఇరిటేషన్ వస్తుంది. అయితే యూత్ లో కొందరు నిబ్బాలను మాత్రం ఆకట్టుకునేలా ఉందని చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక హీరోగా దీపక్ సరోజ్ పెర్ఫార్మన్స్ పరంగా ఆకట్టుకున్నా, ఆ పెద్ద మీసాలు ఉండే లుక్ లో కాస్త ఎబ్బెట్టుగా ఉందని, చిన్న పిల్లాడికి మీసాలు అతికించినట్టుందని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు ఖచ్చితంగా దూరంగా ఉంటారు. అయితే సిద్ధార్థ్ రాయ్ రొమాంటిక్ సినిమాలు, ఒక రకమైన సి గ్రేడ్ సినిమాలని ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం నచ్చేలా ఉందని టాక్. ఇక రాధన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.

- Advertisement -

ఏది ఏమైనా అర్జున్ రెడ్డి 2.0 లా ఉందని ఫైనల్ గా ఒక గట్టి టాక్ అయితే వస్తుంది. రేటింగ్ అయితే 2/5 లోపు ఇస్తున్నారు. అయితే అది బోల్డ్ సీన్లు, కిస్సులు వంటి సీన్లలో పరిధి దాటేలా ఉందని ఒక వర్గం ఆడియన్స్ అంటుంటే, బాలీవుడ్ లో ఇంతకంటే ఎక్కువే ఉంటాయని కొందరు సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఫైనల్ టాక్ ఏంటో తెలియాలంటే మరి కొన్ని గంటల వరకూ వెయిట్ చేయాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు