Sundaram Master First Review : సుందరం మాస్టర్ మూవీ ఫస్ట్ రివ్యూ..

టాలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్ లలో ఒకరైన ‘హర్ష చెముడు’ ప్రధాన పాత్రలో “సుందరం మాస్టర్” అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను RT టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్ లో మాస్ మహరాజ్ రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర సంయుక్తంగా నిర్మించడం జరిగింది. చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, సెన్సార్ నుండి యూ సర్టిఫికెట్ దక్కించుకుంది.

అయితే సిటీ లోనే కొన్ని థియేటర్లలో ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్స్ వేయగా మూవీ ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.. ఇక మూవీ ఎలా ఉందంటే.. ఒక ఇంగ్లిష్ టీచర్ అయిన సుందరం మాస్టర్ సమాజానికి దూరంగా బతుకుతున్న ఒక మారుమూల అటవి ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ప్రజలకు ఇంగ్లీష్ నేర్పించడానికి వెళ్తాడు. అలా వెళ్లిన మాస్టర్ కి కొన్ని రోజులకు ఒక షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఉండే అందరికి ఇంగ్లీష్ వస్తుంది. దాంతో అటు ఇటుగా ఇంగ్లీష్ వచ్చిన సుందరం మాస్టర్ ఇబ్బంది పడతాడు. అయితే సుందరం మాస్టర్ ని అక్కడికి గవర్నమెంట్ పంపిన కారణం వేరే ఉంటుంది. ఆ ఊళ్ళో ఒక రహస్యం దాగి ఉందని, ఆ రహస్యమేంటో కనుక్కోవడానికి పంపుతారు. ఆ రహస్యమేంటి అసలు ఆ ఊళ్ళో జనాలెందుకు అలా ఆటవికుల్లా బ్రతుకుతారు అనేది సినిమా స్టోరీ.

అయితే సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా ఉన్నా, కొత్తగా ఉంటుందనుకున్న ఆడియన్స్ ని నిరాశ పరుస్తుంది. సినిమా కథ నేపథ్యం చాలా చిన్నది కాగా, దర్శకుడు దీన్ని అనవసరంగా ల్యాండ్ స్కేప్ లో తీసాడని నెటిజన్లు అంటున్నారు. ఓపెన్ గా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్ లా తీయాల్సింది, సినిమాలా తీసి బోర్ కొట్టించారు అని చూసిన ఆడియన్స్ అంటున్నారు. అయితే పెర్ఫార్మన్స్ పరంగా హర్ష చెముడు బాగానే చేసిన ఇతర నటీనటులు ఎక్కువగా కొత్త వారే కావడంతో ఆడియన్స్ కూడా పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారని టాక్.

- Advertisement -

ఇక టెక్నికల్ గా ఈ సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించినా, ఒక గిరిజన గ్రామం కరెంట్ సదుపాయాలు కూడా లేకుండా ఎలా ఉంటుందో అలా చూపించాలని ట్రై చేసినా ప్రేక్షకులకి ఆ ఫీలింగ్ రాలేదని జనాలు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వారం వస్తున్న సినిమాల్లో ఈ సినిమాపైనే ప్రేక్షకుల హైప్ ఉండగా, సుందరం మాస్టర్ మాత్రం నిరాశపరిచాడని సమాచారం వచ్చింది. ఓవరాల్ గా సుందరం మాస్టర్ సినిమాకి తక్కువ.. షార్ట్ ఫిలిం కి ఎక్కువ అనే ట్యాగ్ ఇస్తున్నారు. రేటింగ్ కూడా 2 / 5 కన్నా తక్కువేనట. మరి సాధారణ ప్రేక్షకుల తుది తీర్పు ఎలా ఉంటుందో మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు