Ananya Pandey : రకుల్ పెళ్ళిలో రౌడీ హీరో లవర్… చీర ధర తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే

ఫిబ్రవరి 21న గోవాలో కొత్త దంపతులు రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల వివాహం గ్రాండ్ గా జరిగింది. రకుల్ కు సౌత్ లోనే సార్డం వచ్చినప్పటికీ, ఆమె పెళ్లికి టాలీవుడ్ స్టార్స్ ఎవరికీ ఆహ్వానం అందలేదు. బాలీవుడ్ నుంచి మాత్రం పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. అందులో షాహిద్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, ఆదిత్య రాయ్ కపూర్, ఇషా డియోల్, భూమి పెడ్నేకర్, తాహిరా కశ్యప్ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. అయితే అందరిలోకెల్లా “లైగర్” హీరోయిన్, బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రకుల్ పెళ్లి వేడుకలో చీరలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. మామూలుగానే తళుక్కున మెరిసే లుక్స్, స్టైల్, ఫ్యాషన్ తో బెంచ్ మార్క్ ను సెట్ చేసే అనన్య మరోసారి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ మహోత్సవంలో అనన్య పాండే బంగారు రంగు చీరలో, గ్లామరస్ వెడ్డింగ్ లుక్ లో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె తన అభిమానులకు ఈ ఫోటోలను పోస్ట్ చేసి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. “చుట్టూ ప్రేమతో చంద్రుడు కింద సూర్యుడిని అనుభూతి చెందుతున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చి నెటిజెన్లను తన వైపుకు తిప్పేసుకుంది. తాజాగా అనన్య పాండే పోస్ట్ చేసిన ఆ స్టాండింగ్ లుక్ ను డీకోడ్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. అంతేకాకుండా ఆ చీర ధర విషయాన్నీ కూడా బయట పెట్టేశారు. ఆ ఫోటోలో అనన్య న్యూడ్ షిమ్మర్ చీరను ధరించగా, దానికి గోల్డెన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో పాటు అందమైన ఫాబ్రిక్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది. చీర బోర్డర్ ను బంగారు సీక్వెన్స్ డీటెయిల్స్ తో భారీగా అలంకరించారు. అలాగే చీర కింద భాగంలో ప్రిల్స్ ఉండడంతో స్పెషల్ అట్రాక్షన్ అనిపిస్తోంది.

ఈ చీరకు జోడిగా బ్యూటిఫుల్ గోల్డెన్ ఎంబ్రాయిడరీ, సీక్వెన్స్ తో అలంకరించిన గోల్డెన్ బ్రాలెట్ బ్లౌజ్ ధరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడంతో, దాని ఖరీదు ఎంత అని నెటిజెన్లు ఆరా తీసేసి, ధరను కూడా పట్టేశారు. ఈ చీరను ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేయగా, దాని ఖరీదు 1.70 లక్షలు అని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న వారు రకుల్ పెళ్లిలో అనన్య దాదాపు 2 లక్షల చీరను ధరించిందా?! అని షాక్ అవుతున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు