Rakul – Jacky: 2 సాంప్రదాయ పద్ధతుల్లో రకుల్ –  జాకీ ల పెళ్లి..కారణం..?

గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీలు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఆ ప్రేమకి పుల్ స్టాప్ పెడుతూ వివాహబంధం లోకి అడుగు పెట్టబోతున్నారు.. గోవా వేదికగా ఇప్పటికే వీరి పెళ్లి వేడుకకు సంబంధించి పనులన్నీ కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకతో ఈ సంబరం కాస్త మొదలయ్యింది.ముఖ్యంగా సంగీత్ లో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి సరదాగా గడిపారు. తమకు నచ్చిన డాన్సులు వేస్తూ రకరకాల ఆటలతో, పాటలతో బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈరోజు ఉదయం చుద్దా అనే సాంప్రదాయ కార్యక్రమం మొదలయింది. ఇక ఈరోజు 3:30 గంటల తరువాత ఐటీసీ గ్రాండ్ సౌత్ గోవాలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. అయితే వీరి పెళ్లి వేడుక ఆనంద్ ఖరాజ్ , సింధీ శైలిలో జరగబోతున్నట్లు సమాచారం. మరి ఈ రెండు సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరగడానికి కారణం ఈ రెండు కుటుంబాలు రెండు సాంప్రదాయాలకు చెందినవారు కావడం.. ఈ వేడుకకు బంధువులు కొద్దిమంది మిత్రులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.. ఇక ఈ వివాహ వేడుకకు ఇప్పటికే శిల్పా శెట్టి , ఈమె భర్త రాజ్ కుంద్ర ,టైగర్ ష్రాఫ్, ఈషా డియోల్ , అక్షయ్ కుమార్, భూమి పడ్నేఖర్, షాహిద్ కపూర్ ,సోనం కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

ఇక ఈ పెళ్లి తర్వాత సన్నిహితులకు ,బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ గా పార్టీ కూడా ఇవ్వబోతున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చాలామంది హీరోలతో నటించి భారీ క్రేజ్ అందుకుంది. ఇక చివరిగా నాగార్జునతో మన్మధుడు 2 లో నటించింది. ఏజ్ బార్ హీరోతో నటించేసరికి అవకాశాలు కూడా తగ్గాయనే వార్తలు వినిపించాయి.. దాంతో బాలీవుడ్ కి మకాం మార్చిన రకుల్.. అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ నటుడిని వివాహం చేసుకోబోతోంది కాబట్టి అక్కడే సెటిల్ అవుతుందా లేక టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుందా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు