Ram Charan: రామ్ చరణ్ కి వున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా..?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే గ్లోబల్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న మెగా హీరో రామ్ చరణ్.. మిస్టర్ పర్ఫెక్ట్ అన్న పేరును దక్కించుకున్నారు.. అంతేకాదు ఇప్పటివరకు ఏ అమ్మాయి జోలికి వెళ్ళని ఈయన తండ్రి చాటు బిడ్డ.. ఆర్ఆర్ఆర్ లోని పాటకు ఆస్కార్ రావడంతో.. అక్కడ రెడ్ కార్పెట్ పై మెరిసి.. మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను కూడా ప్రపంచవ్యాప్తం చేశారు .. ఇలాంటి రామ్ చరణ్ ఇప్పటికీ కూడా తండ్రి మాట జవదాటని రాముడు.. మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ తో ఫ్యామిలీ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. సినిమాలు, షూటింగ్స్.. అవి లేకపోతే మిగతా సమయం అంతా ఫ్యామిలీకే కేటాయిస్తారు.. అంతేకాదు జేమ్స్ కామెరూన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు చేత కూడా శభాష్ అనిపించుకున్న రామ్ చరణ్ గతంలో ఎలా ఉన్నా సరే రంగస్థలం సినిమా నుంచి పూర్తిగా మారిపోయారు.

గతంలో యాంటీ ఫ్యాన్స్ చేత ట్రోల్స్ కి కూడా గురైన రామ్ చరణ్.. రంగస్థలం సినిమా తర్వాత నుంచి మెచ్యూరిటీ చూపించారు.. చరణ్ కి ఇండస్ట్రీలో రాక ముందు చాలా కోపం ఉండేదట.. కానీ ఇప్పుడు అది కూడా లేదు.. ప్రశాంతంగా ఉంటారు.. ఎక్కడికి వెళ్ళినా చిన్న పెద్ద అందరిని గౌరవిస్తారు.. కలిసిమెలిసి ఉంటారు. అభిమానులతో ప్రేమగా మాట్లాడుతారు.. అందుకే మెగా ఫ్యాన్స్ కే కాదు మిగతా అందరికీ కూడా చరణ్ అంటే అంత ఇష్టం.. అందుకే చరణ్ ని విమర్శించే వారు కూడా లేరు ..అలాంటి ఈయనలో ఎంత మార్పు వచ్చినా ఒక బ్యాడ్ హాబిట్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ వస్తోందట.. అదేమిటంటే.. మొహమాటం.. మెగాస్టార్ వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన రాంచరణ్ సొంత ఇమేజ్తోనే ఎదిగాడు.. తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్నాడు.. చిరంజీవి రికార్డులను సైతం బద్దలు కొడుతూ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసిన ఈయన ఎక్కువగా మొహమాట పడేవారట..

తనని ఇబ్బందికర పరిస్థితుల్లో పడేసిన వారిని కూడా సైలెంట్గా వదిలేస్తారట. ఏదైనా విషయం చెబితే వారు నొచ్చుకుంటారు అంటే కాస్త వెనుకడుగు వేస్తారట రామ్ చరణ్ .. కచ్చితంగా చెప్పాల్సిన సందర్భాలలో కూడా మొహమాటపడతారని. అది ఆయన మంచితనమే అయినా కొన్నిసార్లు ఆయనకు అది నెగిటివ్గా మారుతుందని.. మంచితనం ప్రతిసారి మనకు మంచి చేయదు అని చెబుతున్నారు అభిమానులు.. అంతేకాదు చరణ్ లో ఉన్న ఆ సిగ్గు, బిడియమే రామ్ చరణ్ కొంపముంచేస్తుందేమో అని కూడా భయపడుతున్నారు.. ఇలాంటి అలవాట్లు ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో తొక్కేసేవారు కూడా ఉంటారని.. ఇకనుంచి అయినా జాగ్రత్తగా ఉండాలని.. ఈ బ్యాడ్ హ్యాబిట్ ని మానుకోవాలని అభిమానులు సలహా ఇస్తున్నారు… చూద్దాం అభిమానుల కోరిక మేరకైనా రామ్ చరణ్ తన హ్యాబిట్ ని మానుకుంటారేమో..

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు