Ram Charan : ఈ మూడు ఫిక్స్ అయితే గేమ్ ఛేంజర్ కి ఇక దీపావళే దిక్కు?

టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమాకి రాని ఇబ్బంది రామ్ చరణ్ సినిమాకే ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు. ఒకటి కాదు రెండు కాదు గత మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నా ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ మాత్రం ఇప్పటివరకూ రాలేదు. శంకర్ షణ్ముగం మామూలుగా నెమ్మదిగా సినిమాలు తీస్తాడని తెలిసిందే. కానీ మరీ ఇంత నెమ్మదిగా ఈ సినిమా తెరకెక్కడం చరణ్ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. ఇదంతా ఇండియన్ 2 మళ్ళీ మొదలవడం మూలానే అని అందరికి తెలిసిందే. అయితే కనీసం ఆ సినిమా అయినా మొత్తం పూర్తి చేసి రిలీజ్ చేసాక తీరిగ్గా, గేమ్ ఛేంజర్ దృష్టి పెడతాడు అని అనుకుంటే అలా కూడా చేయకుండా, ఓ వారం అటు, మరో వారం ఇటూ సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నాడు.

ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై మళ్ళి టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ లో గేమ్ ఛేంజర్ 2024 సమ్మర్ లో ఉంటుందని చాలా వార్తలు వచ్చాయి. కానీ 2024 మొదలవడం అందులో రెండు నెలలు పూర్తవడం కూడా జరిగిపోయాయి. కానీ సినిమా రిలీజ్ డేట్ పై రెస్పాన్స్ అయితే రాలేదు. ఇకపోతే సమ్మర్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. అటు దసరా కి పది రోజుల ముందే పవన్ కళ్యాణ్ ఓజి తో వస్తుండగా, ఆ తరువాత ఎన్టీఆర్ దేవరతో అక్టోబర్ 10న రిలీజ్ కి రెడీ అవుతుంది. పైగా లేటెస్ట్ గా తండేల్ కూడా దసరా రిలీజ్ కే ముహూర్తం పెట్టుకున్నారు.

- Advertisement -

అయితే తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ రిలీజ్ అవడానికి టాలీవుడ్ లో సరైన సీజన్ కూడా లేదని చెప్పాలి. ఆల్రెడీ సంక్రాంతి అయిపోగా, ఈ సమ్మర్ లో రావాల్సిన సినిమాలు రిలీజ్ డేట్ ని ఫిక్స్ అయ్యాయి. అయితే దసరా రిలీజ్ కి ఆ మూడు సినిమాలు లాక్ చేసుకుంటే గేమ్ ఛేంజర్ దీపావళికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా దసరాకి మిగతా మూడు సినిమాల్లో ఏదైనా వాయిదా పడితే గేమ్ ఛేంజర్ దసరాకి వచ్చే ఛాన్స్ ఉంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు