K. Vishwanath : కళాతపస్వి చిత్రాలు S అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయో తెలుసా?

తెలుగు చలన చిత్ర మహా దర్శకుల్లో అగ్రగణ్యుడైన కె. విశ్వనాధ్ గురించి ఆయన తీసే సినిమాల గురించి తెలిసే ఉంటుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాల మీద, అలాగే కళలపైన విశ్వనాధ్ తీసే సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమని శిఖరాగ్రాన నిలబెట్టాయి. కమర్షియల్ హంగులతో సినిమాలు తీస్తేనే హిట్ అవుతాయనే అపోహలో ఉండే ఎంతో మంది దర్శకులకి కళ్ళు తెరిపించిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడైన కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన అత్యుత్తమ చిత్రాల గురించి చెప్పమంటే ఏది ముందో కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే ఆయన తీసిన కళాఖండాలు అలాంటివి.

అయితే విశ్వనాధ్ తెరకెక్కించిన సగానికి పైగా సినిమాలకు S అక్షరంతో మొదలయ్యే సినిమాలే ఉండడం విశేషం. 1973 లో తీసిన శారద అనే చిత్రంతో మొదలైన ఈ ఎస్ సెంటిమెంటు ఆయన చివరి చిత్రమైన శుభప్రదం దాకా సాగింది. ఒక్కసారి గమనిస్తే.. శారద, సిరి సిరి మువ్వ, సీతామహలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతి ముత్యం, సిరి వెన్నెల, శృతి లయలు, స్వయంకృషి, స్వర్ణ కమలం, సూత్ర ధారులు, స్వాతి కిరణం, శుభ సంకల్పం, స్వరాభిషేకం, శుభప్రదం.. ఇవే గాక హిందీలో సర్గం, శుభ్ కామ్నా, సంజోగ్, సర్ సంగమ్, సంగీత్ చిత్రాలకు ఎస్ అక్షరం తోనే మొదలయ్యేలా టైటిల్ కుదిరింది. అయితే వీటి మధ్యలో వేరే టైటిల్ తో కూడా చాలా సినిమాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే.

అయితే ఓ సందర్భంలో ఈ S సెంటిమెంట్ అంశంపై స్పందించిన కళాతపస్వి విశ్వనాథ్ తాను మాట్లాడుతూ, నేను ఉద్దేశ్య పూర్వకంగా నా సినిమాలకు S అనే అక్షరం తో పేరు పెట్టను. నా కథకు తగ్గ టైటిల్ మాత్రమే పెడతా. కానీ ఆపేరు చివరకు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యేది అవుతుంది. ఇది కూడా యాధృచ్చికమే గాని సెంటిమెంట్ తో ఏమి పెట్టలేదు అని తెలిపారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు