K. Vishwanath jayanthi Special : “కళాతపస్వి” కళాసేవకు ప్రజా పట్టాభిషేకం..

కాశీనాధుని విశ్వనాథ్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈయన అధ్యాయం ఒక మహా ప్రస్థానం. మహామహులైన చిరంజీవి, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులకే గురువు ఈయన. ఈ జెనరేషన్ పిల్లలకి విశ్వనాథ్ గారిని చూపిస్తే ఈయన్ని చాలా సినిమాల్లో తాత క్యారెక్టర్లలో చూసాం అని అంటుంటారు. ఒక నటుడిగానే ఇప్పటివాళ్ళకి తెలుసు. కానీ పాతికేళ్ల ముందుకు వెళితే విశ్వనాథుడు తీసిన కళాఖండాలు మచ్చుకు కొన్ని చూపిస్తే ఇంత గొప్ప చిత్రాలు తీసారా ఈయన అంటూ, ఆయన కళాభిరుచికి చేసిన కళాసేవకి చేతులెత్తి దండం పెడతారు. ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం, ఒక స్వయంకృషి ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభని తెలియచేస్తాయి. అంత గొప్ప స్థాయి ఉన్న కళాతపస్వి విశ్వనాథుడి(1930 feb 19) జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ, ఒక్క సారి విశ్వనాధ్ చేసిన కళాసేవ గురించి ఒక్క సారి గుర్తు చేసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ప్రశస్తమైన సినిమాలను దర్శకత్వం వహించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. మామూలుగా ఒక దర్శకుడు అతను తీసిన సినిమాల్లో కొన్ని గొప్ప సినిమాలు చెప్పాలంటే వేళ్ళ మీద లెక్కపెట్టి చెప్తారు. కానీ విశ్వనాధ్ సినిమాల గురించి చెప్పాలంటే లెక్క సరిపోదు. ఏ సినిమాకి మొదటిస్థానం ఇవ్వాలో కూడా చెప్పలేము. అంతటి గొప్ప చిత్రాలు తెరకెక్కించారాయన. ముఖ్యంగా భారతీయ సాంస్కృతిక కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం తెలుగు చిత్ర పరిశ్రమని గొప్ప స్థాయిలో నిలబెట్టాయి. అంతే కాదు సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన సప్తపది, స్వయంకృషి, శుభలేఖ, ఆపద్బాంధవుడు చిత్రాలు దర్శకుడిగా ఆయన ప్రతిభని చాటిచెప్తాయి.

అయితే విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్, ఇళయరాజా వంటి వారిని సంగీత దర్శకులుగా ఎంచుకునేవారు. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశ్యాన్ని తన సినిమాలో ఆవిష్కరించి ప్రజలందరికి చైతన్యం కలిగించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన సృష్టించిన కళాఖండాలు తెలుగు చిత్ర పరిశ్రమకి అంత మేలు చేసాయి కాబట్టే కళాతపస్వి చిత్రాలకు ప్రజలు పట్టాభిషేకం చేసారు.

- Advertisement -

తెలుగు వాళ్లకి తెలియని శంకరశాస్త్రిని గాన గంధర్వుడిని చేసినా, డ్యాన్సులు, ఫైట్లు చేసే చిరంజీవిని చెప్పులు కొట్టుకునే సాంబయ్యగా చూపించినా ఆయనకే చెల్లింది. ఆయన భౌతికంగా మనతో లేకపోయినా ఆయన తెరకెక్కించిన కళాత్మకమైన చిత్రాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు