Keerthy Suresh Marrriage : కమెడియన్ తో కీర్తి సీక్రెట్ మ్యారేజ్… అల్లుడూ అంటూ కంగ్రాట్స్ చెప్పిన తల్లి

మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో ఉన్న బిజీ బిజీ హీరోయిన్లలో ఒకరు. అయితే ఈ బ్యూటీ పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి కీర్తి సురేష్ సీక్రెట్ మ్యారేజ్ గురించి వార్తలు బయటకు వచ్చాయి. గతంలో ఈ బ్యూటీ ఓ కమెడియన్ ను మ్యారేజ్ చేసుకుందని రూమర్లు రాగా, ఆయన స్వయంగా ఇప్పుడు స్పందించడంతో మరోసారి ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు? కీర్తి సురేష్ తో ఆయన పెళ్లి అంటూ రూమర్స్ రావడానికి గల కారణం ఏంటి? అంటే….

హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది సర్వ సాధారణం. అలాగే కీర్తి సురేష్ కు ఇప్పటివరకు ఆమె ప్రమేయం లేకుండానే దాదాపు మూడు నాలుగు సార్లు పెళ్లి చేసేసి ఉంటారు నెటిజన్లు. ముందుగా ఓ స్టార్ హీరోతో కీర్తి ప్రేమలో ఉందని అన్నారు. ఆ తర్వాత కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, కీర్తి మధ్య ప్రేమాయణం నడుస్తోందని రూమర్లు వైరల్ అయ్యాయి. మరోసారి ఎవరో పారిశ్రామికవేత్తతో ఎంగేజ్మెంట్, పొలిటీషియన్ తో పెళ్లి వంటి పుకార్లు జోరుగా షికార్లు చేశాయి. ఆ వార్తలు అన్నింటిని కీర్తి కుటుంబం కొట్టి పారేసింది. అయితే కొన్ని రోజుల క్రితం ప్రముఖ తమిళ కమెడియన్ సతీష్ ను కీర్తి సురేష్ సీక్రెట్ గా వివాహం చేసుకుంది అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటో కూడా నెట్టింట్లో బాగా సందడి చేసింది. ఆ వార్తలపై తాజాగా సతీష్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం “వితికారన్” అనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సతీష్ కీర్తి సురేష్ తో తన పెళ్లి అంటూ రూమర్స్ ఎలా వచ్చాయి అనే విషయాన్ని వెల్లడించారు.

సతీష్ మాట్లాడుతూ ఇళయ దళపతి విజయ్ నటించిన “భైరవ” సినిమాలో తాను కీర్తి సురేష్ తో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో పూజా కార్యక్రమం జరిగిందని. అదే టైంలో అక్కడున్న వారందరూ మెడలో పూలమాలలు వేసుకున్నారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే తాము కూడా పూలమాలలు వేసుకోగా, తామిద్దరు మాత్రమే కనిపించేలా ఫోటోలను కట్ చేసి వైరల్ చేశారని, అందుకే తామిద్దరూ తామిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నాం అనే వార్తలు వచ్చాయని సతీష్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ వార్తలు విన్నప్పుడు తనకు చాలా బాధ కలిగిందని, అదే సమయంలో కీర్తి సురేష్ తల్లి మేనక ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ అల్లుడు అని అనడంతో షాక్ అయ్యానని వెల్లడించారు. కానీ ఆ రూమర్స్ ను వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదని తర్వాత అర్థమయిందని, తాను 2019లో సింధుని వివాహం చేసుకున్న తర్వాతనే ఆ పుకార్లు ఆగిపోయాయని కమెడియన్ సతీష్ పేర్కొన్నారు. కాగా 70కి పైగా సినిమాల్లో నటించి కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సతీష్ ప్రస్తుతం “వితికారన్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు