Most Popular Personalities : మోస్ట్ పాపులర్ తెలుగు టీవీ పర్సనాలిటీస్ లిస్ట్… ఫస్ట్ ప్లేస్ లో ఎవరంటే?

బుల్లితెరపై పలు రియాలిటీ షోల దగ్గర నుంచి సీరియల్స్, గేమ్, కామెడీ షోలు, డ్యాన్స్ షోలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ వంటి వారి గురించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. మరోవైపు సీరియల్స్ లో కనిపించే నటీనటులకు వెండి తెరపై స్టార్ హీరో హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది బుల్లితెర ప్రేక్షకుల్లో. అయితే వీళ్ళలో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఎవరికి ఉంది? ఎవరు ఈ పాపులర్ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు? అనే విషయాలు తాజాగా తేలిపోయాయి.

2024 జనవరిలో ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వే ప్రకారం ఈ జాబితాలో పలువురు ప్రముఖ టీవీ నటీనటులకు టాప్ ఫైవ్ లిస్ట్ లో స్థానం దక్కింది. ఇందులో ప్రముఖ యాంకర్లు సుమ, ప్రదీప్ లతో పాటు జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు ఉండడం విశేషం. ఆర్మాక్స్ క్యారెక్టర్స్ ఇండియా లవ్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో జనవరి నెలకు గాను తెలుగులో మోస్ట్ పాపులర్ ఫిక్షన్ పర్సనాలిటీస్ లిస్ట్ ను బయట పెట్టారు. ఇందులో యాంకర్ ప్రదీప్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

ఢీ డాన్స్ షోకు గానూ ప్రదీప్ కు ఇందులో ఫస్ట్ ప్లేస్ దక్కింది. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో కమెడియన్ సుడిగాలి సుధీర్ ఉన్నాడు. సుధీర్ ప్రస్తుతం ఢీతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్న సుధీర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక మూడవ స్థానంలో హైపర్ ఆది, నాలుగో స్థానంలో యాంకర్ సుమ నిలిచారు. చమ్మక్ చంద్ర ఐదో స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

వీటితోపాటే తెలుగు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఫిక్షనల్ క్యారెక్టర్లలో ఎక్కువ మంది ఇష్టపడే టాప్ -5 సెలబ్రిటీల లిస్ట్ ను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. అందులో స్టార్ మా లో ప్రసారమయ్యే కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో కృష్ణ పాత్ర మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్ గా మొదటి స్థానంలో నిలవడం విశేషం. రెండో స్థానంలో గుప్పెడంత మనసు రిషి, మూడవ స్థానంలో త్రినయని సీరియల్ లోని నయన, నాలుగవ ప్లేస్ లో నాగపంచమి సీరియల్ లో పంచమి, బ్రహ్మముడిలోని కావ్య పాత్ర ఐదవ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఐదు సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లోనూ టాప్ లోనే ఉంటాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు