Sudigali sudheer: ‘ కాలింగ్ సహస్ర’ను ఆ టాలెంటెడ్ హీరో మిస్ చేసుకున్నాడని తెలుసా..?

జ‌బ‌ర్దస్త్ క‌మెడియ‌న్ నుండి సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్లు కొడుతున్నాడు. ఇప్ప‌టికే సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. వీటిలో గాలోడు సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా త‌ర‌వాత సుధీర్ కు హీరోగా కూడా క్రేజ్ పెరిగింది. ఈ నేప‌థ్యంలో సుధీర్ త‌న త‌రవాత సినిమా కాలింగ్ స‌హ‌స్ర‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అరుణ్ విక్కిరాలా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిచాడు. రాధా ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్, షాడో మీడియా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ చిత్రంలో సుధీర్ కు జోడీగా డాలీషా హీరోయిన్ గా న‌టించింది.

ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు అరుణ్ విక్కిరాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు. కాలింగ్ స‌హ‌స్రకు అర్థం కాలింగ్ అనేది ఆఫీస్ పేరు అని..స‌హ‌స్ర అంటే హీరోయిన్ పేరు అని చెప్పారు. ఈ సినిమాలో సుధీర్ ఎక్క‌డా క‌మెడియ‌న్ గా క‌నిపించ‌డని అది ఓ ప్ర‌యోగ‌మ‌ని చెప్పారు. సినిమాలో సుధీర్ పాత్ర‌తో పాటు శివ‌బాలాజీ పాత్ర‌కు కూడా ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంద‌ని చెప్పారు. అంతే కాకుండా హీరోయిన్ పాత్ర‌కు కూడా మంచి పేరు వ‌స్తుంద‌ని తెలిపారు. ఇక ఈ సినిమా క‌థ‌ను సుధీర్ కంటే ముందే వేరే హీరోకు చెప్పాన‌ని అరుణ్ వెల్లడించారు.

అడ‌విశేష్ గూఢ‌చారి సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న‌కు క‌థ‌ను వినిపించాన‌ని చెప్పారు. ఇది ఆయ‌న చేయాల్సిన సినిమానే అని కానీ మిస్ అయ్యింద‌ని అన్నారు. త్రీ మంకీస్ సినిమాకు రైట‌ర్ గా ప‌నిచేశాన‌ని చెప్పారు. కానీ అంత‌క ముందే సుధీర్ కు ఈ సినిమా క‌థ‌ను వివ‌రించానని తెలిపారు. ఈ క‌థ చెప్పిన స‌మ‌యంతో సుధీర్…నాకు ఎందుకు ఈ క‌థ చెబుతున్నారు.

- Advertisement -

నేను సెట్ అవుతానా అంటూ ఆలోచించాడ‌ని చెప్పారు. కానీ త్రీ మంకీస్ సినిమా స‌మయంలో చాలా క్లోజ్ అయ్యామ‌ని ఆ త‌ర‌వాత ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కింద‌న్నారు. కాలింగ్ స‌హ‌స్రలో చాలా ట్విస్టులు ఉంటాయ‌ని ..ప్రేమ క‌థ కూడా ఉంటుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను చూడ‌వ‌చ్చ‌ని, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే సినిమా అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మ‌రి అడ‌వి శేషు మిస్

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు