Varun Sandesh: తల్లిదండ్రులు కాకపోవడం పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ సందేశ్..!

సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటులలో హీరో వరుణ్ సందేశ్ కూడా ఒకరు.. మొదట హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో పలు సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో కూడా నటించారు వరుణ్ సందేశ్..ఇకపోతే వరుణ్ సందేశ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. హీరోయిన్ వితిక షేర్ తో కలిసి ఒక సినిమాలో నటించారు.. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు.

వీరిద్దరికి వివాహమైనప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.. బిగ్ బాస్ నుంచీ బయటకు వచ్చిన తర్వాత వితిక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ఇందులో పలు విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది..ఈ క్రమంలోనే తాజాగా తమ పిల్లల గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

వరుణ్ సందేశ్ , వితిక షేర్ పెళ్లి చేసుకొని ఇప్పటికీ ఆరేళ్ల పైనే అవుతోంది.. ఈ క్రమంలోని పిల్లల గురించి తరచూ ప్రశ్నలు తమకు ఎదురవుతున్నాయని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్ప లేకపోతున్నాము అంటూ తెలిపారు.. తాము పిల్లల గురించి ఏ విధమైనటువంటి ప్లాన్ చేసుకోలేదు.. కానీ 2018 వ సంవత్సరంలో అమెరికాలో వున్నప్పుడు తాను ప్రెగ్నెంట్ అయ్యా అని.. కానీ.. 40 రోజుల తర్వాత అది మిస్ క్యారేజ్ అయింది అంటూ వితిక తెలిపారు. దీంతో అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చేసాము అని తెలియజేసింది.

- Advertisement -

ఈ విషయం పై మెంటల్గా నేను ప్రిపేర్ అవ్వడానికి చాలా సమయం పట్టింది.. మేం పిల్లల గురించి ప్లాన్ చేసుకోకుండానే మాకు పిల్లలు అయ్యే అవకాశం వచ్చింది.. కానీ కొన్ని కారణాలవల్ల ఇలా కోల్పోవాల్సి వచ్చిందంటూ తెలిపింది. త్వరలోనే పిల్లలను ప్లాన్ చేసుకుంటామంటూ కూడా తెలిపింది వితిక షేర్. నా చిన్న వయసు నుంచే మా తల్లి సింగిల్ పేరెంట్.. నన్ను , నా చెల్లిని ఎలాంటి ఇబ్బందులు పడకుండా పెంచింది.. అందుకే నేను కూడా నేను పడ్డ ఇబ్బందులు నా పిల్లలు పడకుండా కోరుకుంటున్నాను.. అందుకే లైఫ్ లో కాస్త సెటిల్ అయిన తర్వాతే పిల్లలను ప్లాన్ చేసుకుంటామని కూడా తెలియజేసింది వితిక. అంతేకాదు ఈ కోరిక తొందరలోనే తీర్చుకుంటామంటూ కూడా తెలిపింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు