Mahesh Babu : “థ్యాంక్ యూ బాస్”… ఫోన్ పేలో మహేష్ వాయిస్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, పాపులారిటీని ఫోన్ పే క్యాష్ చేసుకోబోతోంది. టాలీవుడ్ లో యాడ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన మహేష్ బాబు వాయిస్ ఇప్పుడు ఫోన్ పేలో రాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పాపులర్ డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఆయన ఫోన్ పేకు తన గొంతును అరువుగా ఇచ్చేశారు. ఇదివరకు ఫోన్ పేలో బిల్ పేమెంట్ చేసేటప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటర్ వాయిస్ వినిపించేది. కానీ త్వరలోనే దాని స్థానంలో మహేష్ బాబు వాయిస్ వినిపించబోతోంది. ఈ అప్డేట్ ను తమ కస్టమర్స్ దగ్గరకు తీసుకురావడానికి ఫోన్ పే ప్రస్తుతానికి వర్క్ చేస్తోంది. ఇప్పటికే దీనికోసం ఫోన్ పే సంస్థ ప్రతినిధులు మహేష్ వాయిస్ శాంపిల్స్ తీసుకొని ఏఐతో ఆయన వాయిస్ ని జనరేట్ చేశారట. ఈ ప్రత్యేకమైన వాయిస్ ఫీచర్ ద్వారా ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లు కస్టమర్లు ఎప్పుడు లావాదేవీలు జరిపినా చెల్లించిన మొత్తంతో పాటు చివరగా మహేష్ బాబు వాయిస్ తో “థాంక్యూ బాస్” అని విన్పిస్తోంది.

ఇప్పటికే ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ జరగగా, అది సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ను ఉపయోగించి మహేష్ బాబు వాయిస్ తో కస్టమర్లను మరింత అట్రాక్ట్ చేయడానికి ఫోన్ పే పెద్ద ప్లానే వేసింది. ఇప్పటికే ఈ తరహాలో బిగ్ బీ అమితాబ్ వాయిస్ విన్పిస్తోంది. ఈ ప్రత్యేకమైన సెలబ్రిటీ వాయిస్ ఫీచర్ అమితాబ్ బచ్చన్ వాయిస్ లో కస్టమర్ చెల్లింపులను చెప్తుంది. ఇదే విధంగా ఇతర భాషల హీరోలతో కూడా ప్లాన్ చేస్తున్నారు ఫోన్ పే నిర్వాహకులు. మలయాళం లో మమ్ముట్టి వాయిస్, కన్నడ భాషలో సుదీప్ వాయిస్ ను ఉపయోగించుకోబోతున్నారట.

- Advertisement -

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే… సంక్రాంతి కానుకగా “గుంటూరు కారం” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ పై కాన్సన్ట్రేషన్ చేశారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై మహేష్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కొరియన్ బ్యూటీని తీసుకోబోతున్నారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాదని టీం కొట్టిపారేసింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు