Mahesh Babu: బాబాయ్ పాటకు కిక్ ఇచ్చే డాన్స్ వేసిన అమ్మాయి.. వీడియో వైరల్..!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ సినిమాలలోని పాటలతో బాగా పాపులర్ అవుతుంటే.. ఆ పాటలకి తమ వారసులు అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేసి మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమా పాటలకు సంబంధించి ఆయన కూతురు సితార ఏ రేంజ్ లో డాన్స్ వేస్తూ ప్రేక్షకులను అలరిస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే క్రమంలో మహేష్ బాబు అన్న కూతురు భారతి కూడా మహేష్ బాబు కూతురు సితార ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు వారసుల అన్న విషయం తెలిసిందే.. అందులో ఒకరు మహేష్ బాబు.. మరొకరు రమేష్ బాబు.. రమేష్ బాబు పెద్దకొడుకు కాగా కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించారు. అయితే ఈయన 2022లో అనారోగ్య సమస్యలతో మరణించారు.. ఆ సమయంలో మహేష్ బాబుకి కరోనా వచ్చి అన్నయ్య చివరి చూపు కూడా చూసుకోలేక చాలా బాధపడ్డారు.. ఆ తర్వాత వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయగా.. అందులో పాల్గొన్న మహేష్ బాబు.. అన్నయ్య రమేష్ బాబు వారసులతో కలిసి దిగిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.. అంతేకాదు రమేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఇండస్ట్రీలో పెద్దగా కనిపించేవారు కాదు.. కానీ ఈ సమయంలో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.. హీరో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకున్నారు.

ఇకపోతే రమేష్ బాబుకి కొడుకు జయకృష్ణ, కూతురు భారతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ పెద్దగా యాక్టివ్ గా ఉండరు.. అయితే ఈ మధ్యకాలంలో కూతురు భారతి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ అవడానికి ప్రయత్నం చేస్తోంది.. మొన్నటి వరకు ఫోటోలతో ఆకట్టుకున్న భారతి ఇప్పుడు బాబాయ్ మహేష్ పాటకి మాస్ డాన్స్ చేసి అదుర్స్ అనిపించింది.

- Advertisement -

ఇటీవల గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాట సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఈ పాటకి భారతి మాస్ డాన్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది ఇక ఈ డాన్స్ వీడియో పై చెల్లి సితార కూడా రెస్పాండ్ అయింది.. వరుస కామెంట్ చేసి తన ఆనందాన్ని తెలియజేసింది.. అంతేకాదు మహేష్ బాబు కూడా ఈ వీడియోని లైక్ చేశారు.. మొత్తానికైతే రమేష్ బాబు కూతురు భారతి ఈ ఒక్క పాటతో మరింత వైరల్ అయిందని చెప్పవచ్చు.

https://www.instagram.com/reel/C3fb8aJBwbd/?utm_source=ig_web_copy_link

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు