Eagle : రవితేజ డిజాస్టర్ ఫేజ్ కంటిన్యూ… “ఈగల్” మిగిల్చిన నష్టం ఎంతంటే?

మాస్ మహారాజా రవితేజ డిజాస్టర్ ఫేజ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. భారీ అంచనాలతో ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన “ఈగల్” బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చి, నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచినట్టు తెలుస్తోంది. మొదటి మూడు రోజులు కలెక్షన్ల పరంగా బాగానే దూసుకెళ్లిన “ఈగల్” ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంతకీ “ఈగల్” మూవీతో ఎన్ని కోట్ల నష్టం వచ్చింది? అంటే…

రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఈగల్”. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. దేవ్ జ్యాంద్ సంగీతం అందించగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలకపాత్రలను పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో చాలా కాలం తర్వాత రవితేజ “ఈగల్”తో మంచి కం బ్యాక్ ఇచ్చాడని అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. ఆ టాక్ కు తగ్గట్టే మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఆ తర్వాత “ఈగల్”కు మిక్స్డ్ టాక్ మొదలై, కలెక్షన్ల పరంగా వీక్ అయింది. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా దక్కకపోవడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు గట్టిగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 25 కోట్ల మేర నష్టాలను “ఈగల్” మిగిల్చింది అని సమాచారం. మొదటి రోజు “ఈగల్ ” దేశవ్యాప్తంగా 6.2 కోట్లు, రెండవ రోజు 5 కోట్లు, మూడవ రోజు 3.40 కోట్లు సాధించి మొదటి మూడు రోజుల్లోనే 11.50 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా కలెక్షన్లు పడిపోయాయి.

రవితేజ గత చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” మూవీ దారుణమైన పరాజయాన్ని ఇచ్చింది. అయితే “ఈగల్” ఆ మూవీ కన్నా భారీ డిజాస్టర్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అసలే “టైగర్ నాగేశ్వరరావు”తో పాన్ ఇండియా రేంజ్ లో తిరస్కరణకు గురైన రవితేజ, కనీసం “ఈగల్” మూవీతోనైనా నార్త్ ఆడియన్స్ ని మెప్పిస్తాడేమోనని అనుకున్నారు అంతా. కానీ ఈ సినిమా కూడా అక్కడ ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

- Advertisement -

ఇక ఈ కంటిన్యూ డిజాస్టర్ సాగా కేవలం రవితేజది మాత్రమే కాదు డైరెక్టర్ కార్తీక్ ది కూడా. రవితేజకు వరుసగా డిజాస్టర్లు ఎదురవుతుంటే, చాలా గ్యాప్ తీసుకుని “ఈగల్”పైనే ఆశలన్నీ పెట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ కెరీర్ కి కూడా ఈ సినిమాతో పెద్ద ఎఫెక్ట్ పడింది. సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన కార్తీక్ మొదటి సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ సినిమా కనీసం దర్శకుడిగా కార్తీక్ కు మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో “ఈగల్” పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. కానీ ఈ మూవీ కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. మొత్తానికి “ఈగల్” మూవీతో హీరో రవితేజ, డైరెక్టర్ కార్తీక్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ముగ్గురూ తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు