Friday BoxOffice : ఈ వారం కమెడియన్స్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ 

ఈ ఏడాది సంక్రాంతికి మొదలైన బాక్స్ ఆఫీస్ క్లాష్ ఇప్పటికి ఇంకా తగ్గలేదు. ఇప్పటిదాకా టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోల మధ్య ఈ క్లాష్ నడిచింది. ఇక ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఇద్దరు టాలీవుడ్ పాపులర్ కమెడియన్ల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ ఏర్పడబోతోంది. ఫిబ్రవరి మూడోవారం అంటే ఈ శుక్రవారం థియేటర్లలో ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. పెద్ద సినిమాలన్నీ మార్చ్ పై కన్నేస్తే, ఈ గ్యాప్ ను చిన్న సినిమాలు వాడుకోవడానికి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం సుందరం మాస్టర్, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అనే రెండు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి.

వైవా హర్ష ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “సుందరం మాస్టర్”. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో హర్షకు జోడీగా దివ్య శ్రీపాద కనిపించబోతోంది. మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హర్ష ఇంగ్లీష్ మాస్టర్ గా కనిపించబోతున్నాడు. ఒక గవర్నమెంట్ స్కూల్ లో సోషల్ టీచర్ గా ఉన్న సుందరం మాస్టారుకు ఓ మారుమూల పల్లెలో ఉన్న స్కూల్ కు ఇంగ్లీష్ మాస్టర్ గా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సుందరం మాస్టారుకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? అక్కడ ఉండే విలువైన వస్తువు ఏంటి? ఆ ఊరు నుంచి సుందరం మాస్టర్ బయటపడ్డాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా
టాలీవుడ్ లో ఇప్పటికే కామెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభినవ్ గోమఠం. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా”. తిరుపతిరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ గోదావరి ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ. మనోహర్ అనే వ్యక్తి గొప్ప పెయింటర్ అవ్వాలని కలలు కంటాడు. అలాగే సొంత ఊర్లో దానిపై బిజినెస్ పెట్టి సెటిల్ అవుదామని అనుకుంటాడు. మరి మనోహర్ కలలుగన్న జీవితాన్ని పొందుతాడా? ఈ క్రమంలో పరిచయమైన ఉమాదేవి ఇతనికి ఎలా హెల్ప్ అయ్యింది? అనేది తెలియాలంటే “మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా” సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

- Advertisement -

సుందరం మాస్టర్ మూవీతో పాటే ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రాబోతోంది. మరి హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న ఈ ఇద్దరు కమెడియన్లు మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. ఈ రెండు సినిమాలతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా వస్తున్న “సిద్ధార్థ్ రాయ్”, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న “ముఖ్య గమనిక” అనే మరో రెండు సినిమాలు కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు