Samarasimha Reddy Re-release: “సమరసింహా రెడ్డి” వచ్చేస్తున్నాడు… రీ రిలీజ్ డేట్ ఫిక్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ “సమరసింహా రెడ్డి” మూవీ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. బాలయ్య సినిమాల్లో ఉండే కొన్ని హై ఆక్టెన్ యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. యాక్షన్ జానర్ లో బాలయ్య సినిమా అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ముఖ్యంగా “సమరసింహ రెడ్డి” సినిమాను బాలయ్య ఫ్యాక్షనిజం, విలన్లను తెగ నరికే హై యాక్షన్ సన్నివేశాల కోసమే చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల స్టైల్ మారింది. కానీ ఒకప్పుడు ఈ ట్రెండ్ టాలీవుడ్ ను ఊపేసింది.

యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా, కేరాఫ్ అడ్రస్ గా బాలయ్య మారడానికి ఈ సినిమానే కారణం అయ్యింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలు తీయడం అనే ట్రెండుకు శ్రీకారం చుట్టిందే సమరసింహారెడ్డి మూవీ. 1999లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. సాధారణంగా సంక్రాంతికి ఉండే భారీ పోటీని తట్టుకొని విన్నర్ గా నిలిచి, తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఫస్ట్ ఆఫ్ లో ఉండే కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య విశ్వరూపం, హీరోయిన్ సిమ్రాన్, అంజలా ఝవేరి గ్లామర్, మణిశర్మ అందించిన అదిరిపోయే సంగీతం కలగలిపి మంచి యాక్షన్ ప్యాక్డ్ మూవీ “సమరసింహా రెడ్డి”.

బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని చెంగల వెంకటరావు నిర్మించారు. అప్పట్లోనే ఈ మూవీ 22 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, జయప్రకాష్ రెడ్డి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. “సమరసింహా రెడ్డి” మూవీ అప్పట్లో రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర సృష్టించింది. అలాగే విడుదలైన 29 థియేటర్లలో ఈ మూవీ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం అప్పట్లో విశేషమే. బాలయ్య కెరీర్లో ఆల్ టైం రికార్డ్ గా నిలిచిన ఈ మూవీ మరోసారి రెడీ అవుతుండడంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

- Advertisement -

25 ఏళ్ల క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది. మార్చ్ 2న “సమరసింహా రెడ్డి” బాలయ్య అభిమానుల ముందుకు రాబోతోంది. రీ మాస్టర్ చేసిన ప్రింట్ తో పాటు 7.1 డాల్బీ సౌండ్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ మాత క్రియేషన్స్ వారు ఈ మూవీని రీ రిలీజ్ చేసి, వచ్చిన డబ్బులను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు