Gaami : విశ్వక్ సేన్ కు షాక్… “గామి” ప్రమోషన్ల విషయంలో హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు హీరోయిన్ చాందిని షాక్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ కాబోతున్న “గామి” ప్రమోషన్ల విషయంలో హ్యాండ్ ఇచ్చి ఈ యంగ్ హీరోను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. మరి చాందిని ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

విశ్వక్ సేన్ అఘోరాగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గామి”. విద్యాధర దర్శకత్వం అందిస్తున్న “గామి” మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా, అభినయ, హారిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉన్న “గామి”కి ఎట్టకేలకు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” వాయిదా వల్ల విడుదల లభించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చ్ 8న రిలీజ్ కాబోతున్న “గామి” మూవీ ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు విశ్వక్ సేన్. కానీ ఇందులో హీరోయిన్ గా నటించిన చాందిని మాత్రం ప్రమోషన్స్ విషయంలో మొండి చెయ్యి చూపిస్తోందని తెలుస్తోంది.

ఆమె సినిమా ప్రమోషన్స్ లో పాలు పంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదట. అసలు చాందిని ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలీదు. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదా? లేదంటే ఇంకేమైనా విబేధాలు ఉన్నాయా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే “గామి” విషయంలో మొదటి నుంచే విశ్వక్ కు కష్టాలు తప్పట్లేదు. ఏళ్ల పాటు ఈ సినిమా రిలీజ్ కు కష్ట పడాల్సి వచ్చింది. తీరా సినిమా రిలీజ్ కు దగ్గర పడితే ఇప్పుడేమో ప్రమోషన్ కష్టాలు మొదలయ్యాయి. ఒక్కడే తన భుజాలపై ప్రమోషన్ల భారాన్ని మోస్తున్నాడు విశ్వక్. ఒక్కడే ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు “గామి” మూవీపై ఇప్పటికే మంచి బజ్ ఉంది.

- Advertisement -

రీసెంట్ గా రిలీజైన “గామి” టీజర్ పై ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసి తనవంతు సపోర్ట్ అందించారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సీనియర్ హీరో అర్జున్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అర్జున్ అనుకున్న సినిమా విషయంలో ఏర్పడిన విబేధాలపై క్లారిటీ ఇచ్చాడు. ఏదైతేనేం చాలా కాలం తరువాత రిలీజ్ కాబోతున్న “గామి”తో విశ్వక్ హిట్ అందుకుంటాడా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు