ఈ వారం థియేటర్లో రాబోయే సినిమాల లెక్క.. కానీ?

టాలీవుడ్ లో ఈ సంవత్సరం ఆరంభమే హనుమాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తో గుడ్ స్టార్టింగ్ దొరికింది అనుకున్నా, ఇప్పటివరకూ మళ్ళీ అంతటి సక్సెస్ కొట్టిన సినిమా రాలేదు. రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, లేటెస్ట్ గా ఊరు పేరు భైరవకోన ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ అయినా మరీ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలేమి కాదు. ఇటు ప్రేక్షకులు కూడా సరైన సినిమా కోసం ఆత్రుత గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ వారం దాదాపు అరడజనుకి పైగా చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయితే అన్ని చిన్న చిత్రాలే కావడం విశేషం. కానీ కంటెంట్ బాగుంటే ఆ చిత్రాలే బయ్యర్ల పాలిట పెద్ద సినిమాలు కావచ్చు. ఆ సినిమాల లెక్క ఒకసారి చూస్తే..

  1. సుందరం మాస్టర్ :
    వైవా హర్ష కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఒక విలేజ్ కామెడీ, సస్పెన్స్ డ్రామా గా తెరకెక్కింది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మహారాజ్ రవితేజ సొంత బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో ఈ సినిమాపైనే ఎక్కువ అంచనాలు ఉన్నాయి.
  2. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా :
    కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా వస్తున్న ఈ సినిమా ఒక కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిరావు దర్శకుడు. వైశాలి రాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ను “కాసుల క్రియేటివ్ వర్క్స్” బ్యానర్ లో భవాని.కె, ప్రశాంత్.వి నిర్మించడం జరిగింది.
  3. భ్రమయుగం :
    మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి హీరోగా మలయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో నటించిన సినిమా “భ్రమ యుగం” ఈ నెల ఫిబ్రవరి 15న మలయాళం లో రిలీజ్ అయి సూపర్ హిట్ అవగా, తెలుగులో ఫిబ్రవరి 23న రేలసే చేస్తున్నారు. భ్రమ యుగం సినిమాని “నైట్ షిఫ్ట్ స్టూడియోస్”, వై నాట్ స్టూడియోస్ బ్యానర్ లో చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ కలిసి నిర్మించగా, తెలుగు వెర్షన్ ని ప్రముఖ నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.
  4. ముఖ్య గమనిక :
    విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాను వేణు మురళీధర్ దర్శకత్వం వహించగా, రాజశేఖర్, సాయి కృష్ణ నిర్మించారు. పోలీస్ ఆక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుంది.
  5. సైరన్ :
    కోలీవుడ్ స్టార్ జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా తమిళ్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, తెలుగులో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
  6. సిద్ధార్థ్ రాయ్ :
    ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో, తన్వి నేగి హీరోయిన్ గా నటించింది. యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమా అర్జున్ రెడ్డి కాపీ అనే నెటిజన్ల విమర్శలతో ఒక కాంట్రవర్సీ చిత్రంగానే థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమా చూసే అవకాశమే లేదు.

ఇక ఈ వారం దాదాపు అరడజను చిత్రాలు రిలీజ్ అవుతున్నా ఇందులో రెండు లేదా మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్లో ఏ సినిమాకు ముందు ఆడియన్స్ ఆదరిస్తారో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు