Sundaram Master Trailer Talk : ఇంగ్లిష్ పాఠాలు చెప్పడానికి మాస్టారొచ్చేశాడు..

టాలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్ లలో ఒకడైన ‘హర్ష చెముడు’ ప్రధాన పాత్రలో “సుందరం మాస్టర్” అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ రాజ్ రవితేజ తన సొంత బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఇక చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 23న రిలీజ్ అవబోతుంది. ఇక ఇంతకు ముందే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా, తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది.

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సుందరం మాస్టర్ సినిమాలో హర్ష ఒక ఇంగ్లీష్ టీచర్ గా కనిపించనున్నాడు. సమాజానికి దూరంగా బతుకుతున్న ఒక మారుమూల అటవి ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ప్రజలకు సుందరం మాస్టర్ ఇంగ్లీష్ నేర్పించడానికి వెళ్తాడు. అలా వెళ్లిన మాస్టర్ కి కొన్ని రోజులకు ఒక షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఉండే అందరికి ఇంగ్లీష్ వస్తుంది. అయితే సుందరం మాస్టర్ ని అక్కడికి గవర్నమెంట్ పంపిన కారణం వేరే ఉంటుంది. ఆ ఊళ్ళో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యమేంటి? అసలు ఆ ఊళ్ళో జనాలెందుకు అలా ఆటవికుల్లా బ్రతుకుతారు అనేది తెలియాలంటే సుందరం మాస్టర్ చూడాల్సిందే.

ట్రైలర్ లో ఆల్మోస్ట్ ఎంటర్టైనింగ్ గానే డిజైన్ చేయగా, ట్రైలర్ లో హర్ష చెముడు ఎప్పట్లానే తన కామిక్ టైమింగ్ తో ఆకట్టుకోగా, అటవి ప్రాంత వాసులకు, హీరోకు మధ్య సీన్లు కామెడీ గా ఉండి ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో కొత్త నటీనటులే ఎక్కువగా ఉండగా, ఫిమేల్ లీడ్ గా దివ్య శ్రీపాద నటించింది. సుహాస్, హర్ష వర్ధన్ కీలకపాత్రల్లో నటించారు. ఇక టెక్నికల్ గా ఈ సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించడం జరిగింది. ఒక గిరిజన గ్రామం కరెంట్ సదుపాయాలు కూడా లేకుండా ఎలా ఉంటుందో అలా చూపించారు. ఈ సినిమాను RT టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్ లో మాస్ రాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర సంయుక్తంగా నిర్మించడం జరిగింది. మరి సుందరం మాస్టర్ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తాడో తెలియాలంటే ఫిబ్రవరి 23 వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు