Harsha Chemudu: సుందరం మాస్టర్… ఇచ్చట ఇంగ్లీషు నేర్పించబడును?

టాలీవుడ్ లో కమెడియన్స్ హీరోలుగా, వాళ్ళే ప్రధాన పాత్రధారులుగా సినిమాలు తెరకెక్కడం ఇప్పుడు మామూలైపోయింది. మొన్న ప్రియదర్శి, నిన్న రాహుల్ రామకృష్ణ, ఇప్పుడు వెన్నెల కిషోర్. ఇక ఈ లిస్ట్ లోకి తాజాగా మరో కమెడియన్ చేరిపోయాడు. యూట్యూబ్ లో కామెడీ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యి, సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ తో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హర్ష చెముడు.

ఇప్పుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో “సుందరం మాస్టర్” అనే సినిమా తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వయంగా మాస్ రాజా రవితేజ తన సొంత బ్యానర్ లో నిర్మించడం జరిగింది. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, సరికొత్తగా ఉండి ఆకట్టుకుంది.

సుందరం మాస్టర్ సినిమాలో హర్ష ఒక ఇంగ్లీష్ టీచర్ గా కనిపించనున్నాడు. ఒక సమాజానికి దూరంగా బతుకుతున్న ఒక మారుమూల అటవి ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ప్రజలకు సుందరం మాస్టర్ ఇంగ్లీష్ నేర్పించడానికి వెళ్తాడు. అలా వెళ్లిన మాస్టర్ కి కొన్ని రోజులకు ఒక షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఉండే అందరికి ఇంగ్లీష్ వస్తుంది. అక్కడి నుండి కథ ఎలా నడుస్తుంది అనేది థియేటర్లో చూడాలి.

- Advertisement -

ఇక టీజర్ లో హర్ష చెముడు ఎప్పట్లానే తన కామిక్ టైమింగ్ తో ఆకట్టుకోగా, అటవి ప్రాంత వాసులకు, హీరోకు మధ్య సీన్లు కామెడీ గా ఉండి ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో కొత్త నటీనటులే ఎక్కువగా ఉండగా, ఫిమేల్ లీడ్ గా దివ్య శ్రీపాద నటించింది. ఒక షాట్ లో సుహాస్ కూడా కనిపించాడు. బహుశా తనది స్పెషల్ అప్పీరెన్స్ అయ్యి ఉండొచ్చు.ఈ సినిమాను RT టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్ లో మాస్ రాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇక సుందరం మాస్టర్ సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు