Vyra Entertainments: నాని30వ సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ ఆ రోజునే?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా తన 30వ సినిమాను శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు. ఇక షూటింగ్ మొదలైన నాలుగు నెలలకే డెబ్బై శాతం ఈ సినిమా షూటింగ్ పూర్తైపోవడం విశేషం. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

నాని30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు గ్లిమ్ప్స్ ను జులై13 విడుదల చేయనున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇక ఈ విషయాన్నీ నాని స్కై డైవింగ్ చేస్తూ స్పెషల్ గా చెప్పడం జరిగింది. తండ్రి కూతుళ్ళ మధ్య ఎమోషన్సే ప్రధానంగా సాగే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా యొక్క టైటిల్ మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమా నుండి ప్రేరణగా తీసుకోవచ్చు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. డాడీ, నాన్న, హలో డాడీ అనే టైటిల్స్ పరిశీలన లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి, కె. ఎస్ మూర్తి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత, నాని మళ్ళీ ఒక క్లాస్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై కామన్ ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక 2023 దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు