Love@65: రిలీజ్ కి రెడీ అయిన ‘VN ఆదిత్య’ సినిమా..!

మూడేళ్ళ సినిమా.. రిలీజ్ కి రెడీ!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా నిలిచిన VN ఆదిత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఈ దర్శకుడు ఆ తర్వాత వరుస ప్లాప్ సినిమాలతో సతమతమయ్యాడు. అదీ గాక కొత్త దర్శకుల ఎంట్రీ తో డల్ అయ్యాడు. మంచి అభిరుచి గల దర్శకులలో ఒకరైన ఈయన చివరగా ఆట అనే సినిమాతో హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత నాలుగైదు సినిమాల వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. ఇక vn ఆదిత్య దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా మాత్రం రిలీజ్ కావడానికి మూడేళ్లు గా కష్టాలు పడుతూ ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది.

సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా లవ్@65. సీనియర్ సిటిజన్స్ లవ్ లో పడితే అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2021 లో మొదలవగా తొందరగానే షూటింగ్ ఫినిష్ అయిన ఈ సినిమా రిలీజ్ కి మాత్రం ఇప్పుడు రెడీ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా కు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఇక లేటెస్ట్ గా సునీల్, అజయ్, సుధీర్, ప్రదీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా మరోసారి సినిమాను గుర్తు చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. త్వరలో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమా ద్వారా ఎలాగైనా మంచి కం బ్యాక్ ఇవ్వాలని డైరెక్టర్ VN ఆదిత్య ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు నటుడిగా రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో మెయిన్ లీడ్ గా సినిమా చేయలేదు. ఇక అలనాటి హీరోయిన్ జయప్రద కు కూడా తెలుగులో ఇది ఒక రీ లాంచ్ లాంటింది. ఇటు అనూప్ రూబెన్స్ కూడా కొంత కాలంగా సరైన సినిమాతో రాలేదు. అయితే బడా బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కడం వల్ల ఇప్పుడు సినిమా మార్కెటింగ్ ప్రమోషన్ కూడా బాగా చేస్తే సినిమాకి ప్లస్ అవుతుంది. మరి చూడాలి ఈ సినిమాతో ఎంతమంది కం బ్యాక్ ఇస్తారో.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు