Shanmukh: యూట్యూబర్ షణ్ముఖ్ రిలీజ్.. సమంత హస్తం ఉందా..?

ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ నిన్న (గురు వారం) గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ షణ్ముఖ్ జస్వంత్ కేసును టేకప్ చేశారు ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర. అసలు విషయంలోకి వెళ్తే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ కోసం హైదరాబాదు పోలీసులు వారి ఇంటికి వెళ్లగా.. అనూహ్యంగా ఇద్దరూ గంజాయి కేసులో పట్టుబడ్డారనే వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్.. డాక్టర్ మౌనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి.. చివరికి తనను మోసం చేసి ఇంకో అమ్మాయి తో పెళ్లికి సిద్ధం అయ్యాడని.. ఆమె పోలీసులను ఆశ్రయించగా.. దీనిపై ప్రశ్నించేందుకు సంపత్ ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులకు షన్ను డ్రగ్స్ తీసుకుంటూ కనిపించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యంగా 16 గ్రాములు డ్రగ్స్ వారింట్లో దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ కేసు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ఈ కేసును కళ్యాణ్ దిలీప్ సుంకర టేకప్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. మీడియా కథనాలకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు దిలీప్.. “యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఆయన సోదరుడు సంపత్ వినయ్ కేసు నేను చూస్తున్నాను.. ప్రస్తుతం షణ్ముఖ్ తండ్రి నా వద్దనే ఉన్నారు. షణ్ముఖ్ పై మీడియాలో వస్తున్న కథనాలకు వాస్తవానికి అసలు ఎటువంటి సంబంధం లేదు.. అన్ని ఆధారాలను మేము పోలీస్ వారికి సమర్పిస్తున్నాము.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాము” అంటూ తెలిపారు.. ఇక దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా షణ్ముఖ సోదరుడు సంపత్ వినయ్..” Urban Kisaan” అనే కంపెనీకి కో-ఫౌండర్. దీనికి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమే కాదు ఆమె ఇన్వెస్టర్ కూడా. ఇక ఈ విషయాలు తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. అన్ని వివరాలు వెల్లడిస్తామని లీగల్ అడ్వైజర్ దిలీప్ కుమార్ సుంకర కూడా వెల్లడించగా.. మరి దీనిపై సమంత ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి..

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు