Tapsee: బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి సిద్ధమైన తాప్సీ..!!

ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలు వివాహం చేసుకొని ఒక ఇంటివారవుతున్న విషయం తెలిసిందే.. గతంలో లాగా తమ జీవితాన్ని సినీ పరిశ్రమకే అంకితం చేయకుండా తమ వ్యక్తిగత జీవితానికి కూడా సమయాన్ని కేటాయిస్తూ వివాహం అనే కొత్త బంధంలోకి అడుగు పెడుతూ.. అందరికీ సంతోషాన్ని కలగజేస్తున్నారు ఈ క్రమంలోనే బాలీవుడ్ మొదలు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా పలు భాషలకు చెందిన నటీనటులు తమకు నచ్చిన వారితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాను ప్రేమించిన ప్రియుడు.. బాలీవుడ్ నిర్మాత నటుడు అయిన జాకీ భగ్నానితో ఏడడుగులు వేసింది.. అలాగే దిల్ రాజ్ తమ్ముడు కొడుకు.. హీరో మూవీ హీరో ఆశిష్ రెడ్డి కూడా వివాహం చేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించారు..

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న తాప్సీ పన్ను కూడా త్వరలోనే ఏడడుగులు వేయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత నటన మీద ఇష్టం ఉండడంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాలో నటించింది.. ఈ సినిమా లో తన గ్లామర్ తో ఆకట్టుకోవడంతో భారీ క్రేజ్ కూడా సంపాదించుకుంది.. అలా వరుస సినిమాలలో అవకాశాలను అందుకుని.. ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మంచి పేరు దక్కించుకుంది.

తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి..అక్కడ ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో కూడా నటిస్తోంది.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ మథియస్ బోను ను వివాహం చేసుకోబోతోంది.. అయితే వీరిద్దరూ దాదాపుగా పదేళ్లపాటు రిలేషన్ లో ఉన్నారనే విషయాన్ని ఇటీవలే తాప్సీ అధికారికంగా వెల్లడించింది. అయితే అంతకుముందు వీరిద్దరికి సంబంధించి ఏ న్యూస్ కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు.

- Advertisement -

ఇప్పుడు తాప్సీ తన బాయ్ ఫ్రెండ్ తో వివాహం కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరి వివాహానికి ఉదయపూర్ వేదికగా ముస్తాబవుతోంది.ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ప్రైవేట్ ఈవెంట్ గానే ఈ వివాహాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా సిక్కు , క్రైస్తవ పద్ధతిలో తాప్సీ వివాహం జరగబోతోందట.. త్వరలోనే డేట్ కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించి న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. షారుక్ ఖాన్ తో కలిసి డంకీ సినిమాలో నటించిన ఈమె ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు.మరోవైపు తదుపరి ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. అందుకే ఈ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. మరి నిజానిజాలు తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు