Tollywood : ఎన్టీఆర్, మహేష్, పవన్ లను స్టార్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హీరోల కంటే హీరోయిన్లకు చాలా తక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఒకవేళ మూవీ హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా హీరోకు, ఆ తరువాత డైరెక్టర్ కు చెందుతుంది. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్లుగా సత్తా చాటుతున్న ముగ్గురు హీరోలు ఎన్టీఆర్, మహేష్, పవన్ లకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది మాత్రం ఒకే హీరోయిన్. ఈ ముగ్గురు స్టార్ హీరోలకు అప్పటిదాకా ఒకలెక్క, ఈ హీరోయిన్ తో సినిమా చేసిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా మారిపోయింది కెరియర్. ఇంతకీ వీళ్ళ బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చిన ఆ హీరోయిన్ ఎవరు? అంటే…

సీనియర్ హీరోయిన్ భూమిక. అవును… పవన్, మహేష్, ఎన్టీఆర్ కెరీర్లను మలుపు తిప్పే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది ఈ హీరోయినే. ప్రస్తుతం ఈ అమ్మడు సీనియర్ అయిపోయింది. కానీ అప్పట్లో భూమికకు మంచి క్రేజ్ ఉండేది. అందాల ఆరబోతకు దూరంగా ఉంటూనే తన క్యారెక్టర్లకు మంచి ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకునేది ఈ అమ్మడు. అదే ఆమెను టాలీవుడ్ లో మిగతా హీరోయిన్ల కంటే స్పెషల్ గా ఉండేలా చేసింది. అలాగే పలువురు హీరోలకు కూడా ఈ బ్యూటీ గోల్డెన్ లెగ్ గా మారింది. ముందుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే… “ఖుషి” సినిమా పవన్ కు ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకు ముందు పలు హిట్ సినిమాలు చేసినప్పటికీ “ఖుషి” రేంజ్ హిట్ అయితే అందుకోలేదు పవన్. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి భూమిక కూడా ఒక మెయిన్ రీజన్ అన్న విషయం తెలిసిందే.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే… సూపర్ స్టార్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారిన మూవీ “ఒక్కడు”. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ కు కూడా భూమికనే మంచి బూస్ట్ ఇచ్చింది. ఎన్టీఆర్, భూమిక జంటగా నటించిన “సింహాద్రి” మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఈ మూవీతోనే ఎన్టీఆర్ మాస్ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోలకు భూమిక తమ కెరీర్లనే మార్చేసే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన హీరోయిన్ గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు