Maname: శర్వా కొత్త మూవీకి ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ టైటిల్?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఎవరు అంటే శర్వానంద్ అని టక్కున చెప్పొచ్చు. హీరోయిజం కంటే కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు శర్వా. స్లో అండ్ స్టడీగా సినిమా సినిమాకూ డిఫరెంట్ జోనర్ ను ఎంచుకుంటూ సినీ ప్రియులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ హీరో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ టైటిల్ అనుకుంటున్నారు అనే ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

శర్వానంద్ 35వ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. “భలే మంచి రోజు” సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ క్లాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. హేషబ్ అబ్దుల్ వహాబ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇక “sharwanand 35” మూవీ టైటిల్ విషయంలో రోజుకో వార్త తెరపైకి వస్తోంది. ఇప్పటిదాకా ఈ మూవీకి “మనమే” అనే టైటిల్ కు మేకర్స్ ఖరారు చేశారని పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పటికైతే ఈ మూవీ గురించి ఏం మాట్లాడుకోవాల్సి వచ్చినా సోషల్ మీడియాలో “మనమే” అనే టైటిల్ ని వాడుతున్నారు. మేకర్స్ ఇంకా ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా, జనాలు మాత్రం దీనికి “మనమే” అనే టైటిల్ ను ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా ఈ సినిమాకు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ టైటిల్ ను పరిశీలిస్తున్నారనే వార్త బయటకు వచ్చింది.

“sharwanand 35″కి “BOB” అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. “బేబీ ఆన్ బోర్డ్” అనేది దీని మీనింగ్. ఇప్పటికే మేకర్స్ “మనమే” అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారని వార్తలు వస్తుండగా, ఇప్పుడేమో “BOB” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేదాకా వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక చిన్న పిల్లవాడి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న “sharwanand 35″లో శ్రీరామ్ ఆదిత్య నాలుగేళ్ల కొడుకు కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ లండన్ లో జరిగింది. రీసెంట్ గా శర్వానంద్ ఈ మూవీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించగా, వేసవిలో “sharwanand 35″ని థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేసి, వచ్చే నెల నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు