Balakrishna: కన్నప్ప చిత్రంలో బాలయ్య.. నిజమేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. కలెక్షన్ కింగ్ గా బిరుదు అందుకున్న మోహన్ బాబు.. తన తదనంతరం తన వారసులుగా.. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మంచు విష్ణు పరవాలేదు అనిపించుకున్నా.. మనోజ్ , మంచు లక్ష్మి మాత్రం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.. అయితే దాదాపుగా కొన్నేళ్ల పాటు మంచు కుటుంబానికి సక్సెస్ అనేది పడలేదు.. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు కన్నప్ప చిత్రం పై జాతీయస్థాయిలో అంచనాలు పెరిగిపోయేలా చేశారు మంచు విష్ణు.. ముఖ్యంగా టైటిల్ రోల్ పోషిస్తున్న మంచు విష్ణు.. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ కాస్ట్ ను ఈ చిత్రంలో భాగం చేసి పాన్ ఇండియా వైడ్ గా చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి. ఇదివరకు ఎన్నడూ చూడని ఒక దృశ్య కావ్యంతో కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

మంచు విష్ణు హీరోగా కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఎలాంటి క్రేజ్ అయితే వచ్చిందో .. ఇప్పుడు మళ్ళీ అలాంటి క్రేజ్ తీసుకురావడం కోసం కన్నప్ప సినిమా లాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ఇందుకోసం భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలైతే చాలు కన్నప్ప సినిమాలో భాగం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.. ముఖ్యంగా మంచు విష్ణు పై అభిమానంతో పాటు మోహన్ బాబు పై ఉండే గౌరవంతో వారు కూడా ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకుంటున్నారు

- Advertisement -

అయితే ఇంతమంది స్టార్స్ రంగంలో దిగుతున్నప్పటికీ.. ఇక్కడితో స్టార్ కాస్ట్ కి పులిస్టాప్ పడింది అనుకుంటే.. ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి రావడం గమనార్హం.. ఈ సినిమాలో ఈయనను కూడా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలయ్య ఒక కీలకమైన పాత్ర కోసం ఇప్పటికే విష్ణు బాలయ్యను సంప్రదించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.. అయితే ఈ పాత్ర కోసం బాలయ్య ఒప్పుకున్నారా లేదా అనే విషయం పై ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం బాలకృష్ణ తన 109 వ చిత్రంలో బిజీగా ఉన్నారు.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఆయన బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు అయితే మంచు విష్ణు వేసిన ప్లాన్ భారీగానే సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.. బాలయ్య కూడా ఈ మధ్యకాలంలో ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తున్నారు. సక్సెస్ రేట్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు అనుకున్న రేంజ్ లో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు