Hanuman: హనుమాన్ సీక్వెల్ కి నో చెబుతున్న స్టార్స్.. కారణం..?

సాధారణంగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అంటే ఆ సినిమా సీక్వెల్ వస్తే కచ్చితంగా అందులో నటించడానికి స్టార్ సెలబ్రిటీలు కూడా వెనుకాడరు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో పోటీ పడుతూ యంగ్ హీరో తేజ సజ్జ నటించి విడుదల చేసిన చిత్రం హనుమాన్.. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ రికార్డులను నెలకొల్పింది. దీంతో నిర్మాతలు కూడా భారీగా లాభపడ్డారని చెప్పవచ్చు. అన్ని ఏరియాలలో కూడా సరికొత్త రికార్డులను సృష్టించి సత్తా చాటింది ఈ సినిమా.. ఈసినిమా విడుదల అయ్యి ఇప్పటికి 45 రోజులు పైగా కావస్తున్నా.. థియేటర్లలో ఇంకా హౌస్ఫుల్గానే ముందుకు వెళ్తోంది.. స్టార్ హీరోల సినిమాకి పోటీగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అప్పుడే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమా టైటిల్ జై హనుమాన్ అంటూ కూడా ప్రకటించారు. ఇకపోతే జై హనుమాన్ మూవీలవ్ హనుమాన్ పాత్ర లో ఒక ప్రముఖ నటుడు నటిస్తారంటూ గతంలో ఎన్నోసార్లు డైరెక్టర్ తెలియజేశారు.. అయితే ఎవరు నటిస్తారు అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.. ఇకపోతే మొదటి భాగంలో హనుమాన్ ఫేస్ ను చూపించలేదు.. అందుకే ఈ పాత్ర కోసం పాన్ ఇండియా హీరో ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. మొదట ఇందులోని పాత్ర కోసం కేజిఎఫ్ నటుడు యష్ ను పరిగణలోకి తీసుకున్నారట. కానీ అతను జై హనుమాన్ లో భాగం కారని.. తన తదుపరి చిత్రం టాక్సిక్ పైన దృష్టి పెడుతున్నట్లు వార్తలు వినిపించాయి.

అలాగే మెగా హీరో రామ్ చరణ్ ను ఇందుకోసం సంప్రదించగా.. పాన్ ఇండియా సినిమాల కమిట్మెంట్ తో బిజీగా ఉండడం వల్ల.. అందుకు అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది..అలాగే ప్రభాస్ , అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయించేలా డైరెక్టర్ ప్లాన్ చేయగా.. ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కు హనుమాన్ పాత్ర పెద్ద సవాల్ గా మారుతోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి విడుదలైనప్పటికీ చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా స్టార్ హీరోల సినిమాలను దాటేసి మరీ వసూళ్లను రాబట్టింది. ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమా సీక్వెల్లో టాప్ స్టార్స్ నటించడానికి ఇష్టం చూకపోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.. మరి అన్ని విషయాలపైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.. ఇక తేజ సజ్జ విషయానికి వస్తే.. జై హనుమాన్ సినిమాలో ఈయన కూడా నటించే అవకాశం లేదన్నట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే పూర్తి వివరాలు తెలియాలి అంటే దీనిపై ప్రశాంత వర్మ స్పందించే వరకు ఎదురు చూడక తప్పదు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు