HBD Sunil : అసిస్టెంట్ డైరెక్టర్ మొదలుకొని..కమెడియన్ గా.. విలన్ గా.. ఇన్స్పిరేషనల్ జర్నీ..

టాలీవుడ్ లో కమెడియన్ గా మొదలై.. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు సునీల్. బ్రహ్మానందం తర్వాత కేవలం తన హావా భావాలతోనే నవ్వించగల కమెడియన్ గా అంతటి గుర్తింపు తెచ్చుకున్న సునీల్. ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడానికి ఎంతో కృషి చేసాడు. బ్రహ్మానందం, అలీ స్టార్ కమెడియన్లు ఏలుతున్నసమయంలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, ఒకానొక దశలో సునీల్ కోసమే సినిమాల్లో స్పెషల్ రోల్స్ క్రియేట్ చేసే స్థాయకి ఎదిగాడు. అయితే అసలు సునీల్ ఒక డాన్సర్ అవుదామని చిన్నప్పుడు ఫిక్స్ అయ్యి, ఆ తర్వాత విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి, అనూహ్యంగా కమెడియన్‌గా టాప్ లెవల్‌కు వెళ్లిపోయాడు. ఈరోజు సునీల్ బర్త్ డే ఈ సందర్బంగా సునీల్ టాలీవుడ్ లో ఎదిగిన తీరుని గుర్తు చేసుకుందాం.

భీమవరం లో పుట్టిన సునీల్ చిన్నతనం నుండే తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని, సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలో రాణించాలని వచ్చాడు. అయితే వచ్చిన వెంటనే అవకాశాలు రాలేదు. అందుకే ఏ రంగంలోనైనా రాణించాలని డిసైడ్ అయ్యి, ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలకి ట్రై చేశాడు. కానీ అందులో చాలా టైం పడుతుందని డాన్సర్ కావాలని అనుకున్నాడు. దాంట్లో డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నా, ఇండస్ట్రీ లో అవకాశాలు మాత్రం రాలేదు. అప్పుడే ఫైనల్ గా యాక్టింగ్ లోకి అడుగుపెట్టాడు. చిరుని ఇన్స్పైర్ గా తీసుకున్న సునీల్ ఏ రోల్ అయినా చేయడానికి సిద్ధపడి, ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమాకి ఆడిషన్స్ ఇవ్వగా అందులో కొన్ని అన్ క్రెడిటెడ్ రోల్స్ లో నటించిన సునీల్ ఆ తర్వాత మూవీ లెంగ్త్ ఎక్కువవడంతో ఆ సీన్స్ కూడా డిలీట్ చేసారు.

అప్పటి నుండి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ బ్రేక్ కోసం ఎదురుచూసాడు. అయితే రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. అప్పట్లో సునీల్, త్రివిక్రమ్, ఆర్పీ పట్నాయక్ రూమ్ మేట్స్ కూడా. అప్పుడు త్రివిక్రమ్ సలహాతో సునీల్ హాస్య నటుడిగా ప్రయత్నించాడు. కొన్ని సినిమాల్లో కూడా అతనికి పాత్రలు ఇప్పించాడు. అప్పుడే ‘నువ్వే కావాలి’ చిత్రంతో కమెడియన్ గా మంచి బ్రేక్ వచ్చింది. ఇక అక్కడి నుండి మొదలుకొని, నువ్వు నేను, మనసంతా నువ్వే, నువ్వే నువ్వే , సొంతం లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అయ్యాడు. సునీల్ స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలో ఏడాదికి దాదాపు 10 నుండి 20 సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయ్యాడు. అప్పట్లోనే బెస్ట్ కమెడియన్ గా నందితో పాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.

- Advertisement -

ఇక ఆ తర్వాత ‘అందాల రాముడు’ సినిమాతో సునీల్ హీరోగా మారగా ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత కూడా సునీల్ కమెడియన్ గా కొనసాగగా, అదే సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాలో సునీల్ హీరోగా నటించగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అక్కడి నుండి సునీల్ హీరోగానే కొన్నాళ్ల పాటు సినిమాలు చేసాడు. పూలరంగడు, జక్కన్న లాంటి సినిమాల హిట్స్ తో పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఆ సినిమాల్లో సునీల్ సిక్స్ ప్యాక్ కూడా కనిపించి తన డెడికేషన్ ఎలా ఉంటుందో చూపించాడు. అయితే ఆ తర్వాత సునీల్ హీరోగా ప్లాప్ పు అందుకోగా, అంతగా రాణించలేదు. తిరిగి కమెడియన్ గా చేసినా, పాత సునీల్ రేంజ్ లో చూడలేకపోయారు ప్రేక్షకులు.

అప్పుడే సునీల్ కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ తీసుకున్నాడు. కలర్ ఫోటో సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్ర కన్నా సునీల్ పాత్ర కొత్తగా అనిపించింది. తన హావభావాలతోనే భయపెట్టేలా చేసిన సునీల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతకు ముందే డిస్కో రాజాతో నెగిటివ్ రోల్ లో కనిపించినా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక సుకుమార్ పుష్ప సినిమాతో సునీల్ కెరీర్ మళ్ళీ పీక్స్ కి చేరింది. ఈ సినిమాలో మంగళం శీనుగా సునీల్ నటన ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా తర్వాత సునీల్ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ముఖ్యంగా సౌత్ లో బిజీ ఆక్టర్ అయ్యాడు సునీల్. ప్రస్తుతం గేమ్ ఛేంజర్, పుష్ప 2 పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు