Naga Chaitanya : అప్పుడే బిజినెస్ మొదలెట్టిన “తండేల్”..

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న “తండేల్” మూవీ షూటింగ్ గ్యాప్ లేకుండా హైదరాబాద్ లో జరుగుతుంది. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుందన్న విషయం తెలిసిందే. షూటింగ్ మొదలై ఆరు నెలలైనా ఇంకా షూటింగ్ చాలా బాకీ ఉందని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం మొత్తం శ్రీకాకుళం, గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల్లోనే జరగుతుండగా, మిగతా సీన్లను సెట్స్ వేసి హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే మేజర్ పార్ట్ అంతా గుజరాత్ పరిసర ప్రాంతాల్లో తీద్దామని అనుకున్నా కొన్ని రకాల సీన్లకు అక్కడ వీలుపడట్లేదు. అందుకే హైదరాబాద్ లో సెట్లు వేసి తీస్తున్నారు. అందులో సముద్రం VFX షాట్స్ చాలా ఉన్నాయట.

ఇదిలా ఉండగా తండేల్ మూవీ బిజినెస్ మాత్రం అప్పుడే మొదలైపోయిందట. చిత్ర యూనిట్ ఇటు షూటింగ్ లో బిజీ ఉంటే అటు నిర్మాత బన్నీ వాసు మాత్రం అప్పుడే బిజినెస్ లెక్కలు మొదలు పెట్టాడు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తండేల్ యొక్క ఓవర్సీస్ బిజినెస్ 6.5 కోట్లకి లాక్ అయిందని సమాచారం. ఇక ఈ బిజినెస్ నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ కావడం విశేషం. అలాగే త్వరలోనే తెలుగు రాష్ట్రాల బిజినెస్ కూడా మొదలవుతుందిట. కానీ సినిమా రిలీజ్ కి మూడు వారాల ముందు మాత్రమే ఇతర రాష్ట్రాల బిజినెస్ చేస్తారని సమాచారం. ఎందుకంటే అప్పుడు సినిమా పై హైప్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని కాబోలు.

ఇక నాగచైతన్య సాయి పల్లవి ల మధ్య ఈ మధ్యనే ఒక సాంగ్ షూటింగ్ కూడా జరుపుకోగా, లేటెస్ట్ గా పలు ఆక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లోనే 80 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరెక్కుతున్న ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు చై. ఇక లవ్ స్టోరీ తర్వాత మరో సారి ఈ కాంబో రిపీట్ అవడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ కానుందని సమాచారం. అయితే తండేల్ రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మేకర్స్ మాత్రం దసరా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ మహాశివరాత్రి రోజు సందర్బంగా తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు