Allari naresh : వరుస సినిమాలతో జోరుమీదున్న అల్లరోడు..

టాలీవుడ్ విలక్షణ నటుడు, కామెడీ హీరో జోరుమీదున్నాడు. కొంత కాలంగా ప్లాపుల్లో పడ్డ ఈ హీరో ఈ ఇయర్ నా సామి రంగ లో స్పెషల్ రోల్ లో నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకుని సూపర్ హిట్ కొట్టి ఘనంగా ఈ యేడాదిని ప్రారంభించాడు, ఇక అలా మొదలు పెట్టాడో లేదో వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు అల్లరోడు. దాదాపు ఇప్పడు నాలుగు సినిమాల్లో నటిస్తున్న నరేష్, ఆ నాలుగు సినిమాలని ఏకకాలంలో షూట్ చేసే పనిలో ఉన్నాడు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తవగానే మరో షెడ్యూల్ లో పాల్గొంటూ బిజీ గా ఉన్నాడు. ఇక తాజాగా సుబ్బు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘బచ్చలమల్లి'(వర్కింగ్ టైటిల్ ) అనే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు నరేష్.

ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈస్ట్ గోదావరి మరియు అన్నవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ మరో నాలుగైదు రోజులు జరుగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ చోటా. కే. ప్రసాద్, DOP గా రిచర్డ్స్ ఎం. నాథన్, ప్రొడక్షన్ డిసైనర్ గా బ్రహ్మ కడలి పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఆరు నెలల ముందే షూటింగ్ మొదలైనా, నా సామి రంగ సినిమా వల్ల కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వగా, ప్రస్తుతం నటిస్తున్న ఇతర పెండింగ్ ప్రాజెక్టుల కోసం మరికొంతకాలం ఆపారు.

ఇక ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ సభకు నమస్కారం, ఆ ఒక్కటి అడక్కు అనే మరో రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాల్లో ముందుగా ఆ ఒక్కటి అడక్కు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అవగా, మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ సినిమాను మల్లి అంకం అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను మార్చి చివరి వారం లో లేదా ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు