Allari Naresh : అల్లరోడి సినిమాకి బ్లాక్ బస్టర్ టైటిల్..!

అల్లరి నరేష్.. ఈ పేరు వింటే ఓ వైపు హిలేరియస్ కామెడీ తో పాటు, మరో వైపు విలక్షణ మైన నటన కూడా గుర్తొస్తుంది. టాలీవుడ్ లో ఒక జెనరేషన్ ఆడియన్స్ ని తన కామెడి సినిమాలతో నవ్వించిన ఈ హీరో గత కొంత కాలంగా తన మార్క్ కామెడీ సినిమాలు చెయ్యట్లేదు. ఫలితంగా మినిమం గ్యారెంటీ హీరో కాస్తా ఒక్క హిట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే రీసెంట్ గా ఉగ్రం సినిమాతో వచ్చినా అది సీరియస్ జోనర్ లో వచ్చిన చిత్రం కాగా, సంక్రాంతి కి నాగార్జున నా సామిరంగలో ప్రత్యేక పాత్రలో నటించి అలరించాడు. ఈ సినిమాలో నాగార్జున కంటే ఎక్కువ మార్కులు అల్లరి నరేష్ కొట్టేశాడని అందరికి తెలిసిందే.

అయితే ఎన్నాళ్లనుంచొ అల్లరి నరేష్ నుండి ఒక పక్కా కామెడీ సినిమా రావాలని అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక అలాంటి సినిమా ఇప్పుడు రాబోతుందని, ఏకంగా టీజర్ తోనే అనౌన్స్ చేసేసారు మేకర్స్. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాజీవ్ చిలక నిర్మిస్తున్న కొత్త సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తుండగా, ఈ సినిమాను మల్లి అంకం అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పేరు అనౌన్స్ చేస్తూ గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా కి ఓ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ ని మళ్ళీ పెట్టడం జరిగింది. ముప్పై ఏళ్ళ కింద వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మూవీ “ఆ ఒక్కటి అడక్కు” గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో ఓ రేంజ్ కామెడీని పేల్చిన ఈ సినిమాను అల్లరి నరేష్ తండ్రి ఇవివియే దర్శకత్వం వహించాడు. ఇక ఆ టైటిల్ ని మళ్ళీ ఇప్పుడు నరేష్ సినిమాకి పెట్టడం జరిగింది. ” ఆ ఒక్కటి అడక్కు” పేరుతో తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా టీజర్ లో హీరోని పెళ్లి కానీ యువకుడిగా చూపిస్తూ, చుట్టూ పక్కల వాళ్ళు సతాయిస్తుంటే ఓర్చుకునే కుర్రాడిగా ఇంట్రో ఇచ్చారు. దీన్ని బట్టి స్టోరీ కాన్సెప్ట్ హీరో పెళ్లి మాత్రమే అని తెలుస్తుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చినా, స్క్రీన్ ప్లే బాగుంటే ఎన్నైనా చూస్తారు జనాలు. ఇక ఈ సినిమాతో టైటిల్ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ తో పాటు, తన కామెడీ సెంటిమెంట్ తోనూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 22న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ లోనే అనౌన్స్ చేసారు. మరి ఈ సినిమాతోనైనా పాత అల్లరి నరేష్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు