Naresh62: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తన జోనర్ లో వస్తున్న అల్లరోడు

అల్లరి నరేష్ ఉగ్రం సినిమా తర్వాత తన పంథా మార్చుకున్నాడు. నాంది సినిమాతో మంచి కం బ్యాక్ హిట్ కొట్టిన నరేష్, అదే రకంగా సీరియస్ గా సినిమాలు చేయడంతో బెడిసికొట్టాయి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు విమర్శకుల ప్రశంసలందుకున్నా… బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆశించినంత ఆడలేకపోయాయి. అందుకే ఇప్పుడు తన కామెడీ జోనర్ లోనే సరికొత్త పద్ధతిలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు “అల్లరి నరేష్”.

బర్త్ డే రోజు ఒక నరేషన్ వీడియో తో అనౌన్స్ చేసిన ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఆ వీడియో లో నరేష్ కి కథ చెప్తూ డైరెక్టర్ అన్ని డీటెయిల్స్ రివీల్ చేస్తాడు. ముందుగా కథ గురించి ప్రస్తావిస్తే, హీరో మూర్ఖత్వం బోర్డర్ దాటిన ఒకడి జీవిత కథ ఏంటి? అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అన్నట్టుగా చూపించారు. ఆ తర్వాత సినిమాకి పని చేసే ఒక్కో టెక్నిషియన్ ని పరిచయం చేస్తూ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసారు.

- Advertisement -

నరేష్ కెరీర్ లో 62వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాకి దర్శకత్వం వహించిన సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అనిస్తుండగా, ఎడిటింగ్ చోటా. కే. ప్రసాద్, DOP గా రిచర్డ్స్ ఎం. నాథన్, ప్రొడక్షన్ డిసైనర్ గా బ్రహ్మ కడలి పని చేస్తున్నారు.

అయితే ఈ సినిమా 2024 లోనే విడుదల అవుతుంది. ఎందుకంటే దీనికంటే ముందే నరేష్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. సభకు నమస్కారం అనే సినిమాతో పాటు, రాజీవ్ చిలక అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. వీటి తర్వాతే సుబ్బు తో తీస్తున్న ఈ సినిమా వస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు