Happy Birthday: నవ్వుల రారాజు అల్లరి నరేష్ కి జన్మదిన శుభాకాంక్షలు

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు వస్తు ఉంటారు. ఒక్కో హీరో ఒక్కో శైలి లో అలరిస్తూ ఉంటారు. చాలా మంది మాస్ జోనర్ లో సినిమాలు తీస్తూ ఉంటారు. కొందరు ప్రయోగాత్మక సినిమాలు చేస్తే, మరొకరు లవ్ స్టోరీస్ తీస్తారు. ఇంకొందరు యాక్షన్ సినిమాలు తీస్తే, మరి కొందరు ఫ్యామిలీ సినిమాలు తీస్తారు. కానీ ఆడియన్స్ కి ఎంతో అవసరమైన కామెడీ సినిమాలు మాత్రం ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఎంచుకుంటారు. వీకెండ్ లో కుటుంబంతో సరదాగా పోయి నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా హీరోలు చేస్తారు.

అలాంటి హీరోల్లో ఒకరు “అల్లరి నరేష్”. ఈరోజు అనగా జూన్30 అల్లరి నరేష్ బర్త్ డే. ఈ సందర్భంగా తనకి filmify టీమ్ తరపున విష్ చేస్తూ నరేష్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై ఒక లుక్కేద్దాం.

అల్లరి సినిమాతో మొదలైన నరేష్ సినీ ప్రస్థానం నేటి ఉగ్రం వరకు ఎన్నో మలుపులతో సాగింది. తండ్రి ఇవివి. సత్యనారాయణ అడుగుజాడల్లో పయనిస్తూ పూర్తిగా కామెడీ సినిమాలు చేసిన నరేష్ ఒక జనరేషన్ మొత్తాన్ని ఏలాడు. కితకితలు మొదలుకొని సీమశాస్త్రి, అహనా పెళ్ళంట, బెండు అప్పారావ్, సుడిగాడు లాంటి కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించాడు.

- Advertisement -

కామెడీ హీరోల్లో నెంబర్ వన్ అయి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ దాదాపు పదేళ్లు స్టార్ గా చలామణి అయ్యాడు నరేష్. అయితే కామెడీ సినిమాలే కాక తనలోపల ఉన్న విలక్షణ నటుడ్ని ఆవిష్కరిస్తూ నేను, గమ్యం, శంభో శివ శంభో,మహర్షి, నాంది లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు.

“గమ్యం” సినిమాలో నరేష్ చనిపోయే సీన్ లో అతని నటనకు ప్రతి ప్రేక్షకుడు కళ్ళు చెమర్చాడు. ఈ సినిమాలో తన నటనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు కూడా అందుకున్నాడు. ఇదేగాక శంభో శివ శంభో, మహర్షి సినిమాలకి కూడా అవార్డులొచ్చాయి.

అయితే తన తండ్రి దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన నరేష్ ఆయన మరణం తర్వాత ఎన్నో ప్లాపులు చవిచూశాడు. తిరిగి హిట్ రావడానికి “నాంది” వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. రీసెంట్ గా ఉగ్రం సినిమాతో ప్రేక్షకులని పలకరించిన నరేష్ ఇప్పుడు “సభకు నమస్కారం” అనే సినిమా తో వస్తున్నాడు.

అయితే నరేష్ లోని కామెడీ సినిమాలను చాలా మిస్ అవుతున్నారు ఆడియన్స్. తిరిగి మళ్ళీ ఆ జోనర్ లో ఒక మంచి హిట్ సినిమా తీయాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇటు filmify తరపున అల్లరి నరేష్ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మళ్ళీ తన స్టైల్ అఫ్ కామెడీ జోనర్ లో సినిమాలు తీసి ఆడియన్స్ ని అలరించాలని కోరుకుంటున్నాము.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు